హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI: బ్యాంకులో డిపాజిట్స్ ఉన్నవారికి ఎస్‌బీఐ షాక్... నేటి నుంచి కొత్త రేట్లు

SBI: బ్యాంకులో డిపాజిట్స్ ఉన్నవారికి ఎస్‌బీఐ షాక్... నేటి నుంచి కొత్త రేట్లు

SBI Interest Rates | ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. కొత్త వడ్డీ రేట్లు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి.

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లను నేటి నుంచి అమలు చేస్తోంది. ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. రీటైల్ టర్మ్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్స్ వడ్డీని తగ్గించింది. మార్చి నుంచి ఇప్పటి వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఎస్‌బీఐ తగ్గించడం ఇది మూడోసారి. వడ్డీ రేట్ల తగ్గింపుతో ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నవారు నష్టపోనున్నారు. వారికి గతంలో లభించిన వడ్డీ కన్నా ఇకపై తక్కువ వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం ప్రత్యేకంగా 'ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్' పేరుతో స్కీమ్‌ను కూడా ఇవాళే ప్రారంభించింది బ్యాంకు. ఈ స్కీమ్‌తో సీనియర్ సిటిజన్లకు ఎక్కువ లాభం ఉంటుంది. ఈ స్కీమ్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

  SBI Interest Rates: ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు ఇవే...

  7 రోజుల నుంచి 45 రోజులు- 3.3%

  46 రోజుల నుంచి 179 రోజులు- 4.3%

  180 రోజుల నుంచి 210 రోజులు- 4.8%

  211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 4.8%

  1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 5.5%

  2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 5.5%

  3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.7%

  5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 5.7%

  సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ ఎక్కువగా వడ్డీ లభిస్తుంది. ఎస్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత సీనియర్ సిటిజన్లకు లభించే వడ్డీ రేట్లు ఇవే.

  7 రోజుల నుంచి 45 రోజులు- 3.8%

  46 రోజుల నుంచి 179 రోజులు- 4.8%

  180 రోజుల నుంచి 210 రోజులు- 5.3%

  211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 5.3%

  1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 6%

  2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 6%

  3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 6.2%

  5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 6.2%

  ఇవి కూడా చదవండి:

  Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ బెస్ట్ ప్లాన్స్ ఎంచుకోండి ఇలా

  Amazon Pay Later: డబ్బులు లేకపోయినా అమెజాన్‌లో వస్తువులు కొనొచ్చు ఇలా

  EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈ విషయం తెలుసుకోకపోతే రూ.50,000 లాస్

  First published:

  Tags: Bank, Bank account, Banking, Investment Plans, Money, Money making, Save Money, Sbi, State bank of india

  ఉత్తమ కథలు