హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి ఎస్‌బీఐ షాక్

SBI: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి ఎస్‌బీఐ షాక్

SBI: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి ఎస్‌బీఐ షాక్
(ప్రతీకాత్మక చిత్రం)

SBI: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి ఎస్‌బీఐ షాక్ (ప్రతీకాత్మక చిత్రం)

SBI Interest Rates | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. లేటెస్ట్ వడ్డీ రేట్లు తెలుసుకోండి.

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఉందా? వడ్డీ కోసం మీ డబ్బుల్ని దాచుకుంటున్నారా? ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు ఎస్‌బీఐ షాకిచ్చింది. అన్ని కాలవ్యవధుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏకంగా 40 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. 100 బేసిస్ పాయింట్స్ 1 శాతంతో సమానం. బల్క్ డిపాజిట్లు అంటే రూ.2 కోట్ల కన్నా ఎక్కువ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటును తగ్గించింది. ఈ నెలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడం ఇది రెండో సారి. కొత్త వడ్డీ రేట్లు మే 27న అంటే ఇవాళే అమలులోకి వచ్చేశాయి.

SBI Interest Rates: ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు ఇవే...

7 రోజుల నుంచి 45 రోజులు- 2.9%

46 రోజుల నుంచి 179 రోజులు- 3.9%

180 రోజుల నుంచి 210 రోజులు- 4.4%

211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 4.4%

1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 5.1%

2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 5.1%

3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.3%

5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 5.4%

సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ ఎక్కువగా వడ్డీ లభిస్తుంది. ఎస్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత సీనియర్ సిటిజన్లకు లభించే వడ్డీ రేట్లు ఇవే.

7 రోజుల నుంచి 45 రోజులు- 3.4%

46 రోజుల నుంచి 179 రోజులు- 4.4%

180 రోజుల నుంచి 210 రోజులు- 4.9%

211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 4.9%

1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 5.6%

2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 5.6%

3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.8%

5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 6.2%

ఇక వృద్ధుల కోసం 'ఎస్‌బీఐ వీకేర్' డిపాజిట్ స్కీమ్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ప్రారంభించిన సంగతి తెలిసిందే. వృద్ధులకు సాధారణంగా ఇచ్చే వడ్డీ కన్నా 30 బేసిస్ పాయింట్స్ అదనంగా వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ 2020 సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంటుంది. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Job Loss: ఉద్యోగం పోతే ప్రభుత్వం నుంచి సాయం... పొందండి ఇలా

Smartphone: రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

LIC: ఈ పాలసీ రూల్స్ మార్చిన ఎల్ఐసీ... కొత్త నిబంధనలివే

First published:

Tags: Business, BUSINESS NEWS, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు