SBI Home Loan: గుడ్ న్యూస్... హోమ్ లోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించిన ఎస్‌బీఐ

SBI Home Loan Interest Rates | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI హోమ్ లోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. లేటెస్ట్ రేట్స్ తెలుసుకోండి.

news18-telugu
Updated: July 1, 2020, 3:44 PM IST
SBI Home Loan: గుడ్ న్యూస్... హోమ్ లోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించిన ఎస్‌బీఐ
SBI Home Loan: గుడ్ న్యూస్... హోమ్ లోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించిన ఎస్‌బీఐ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సొంత ఇల్లు మీ కలా? ప్లాట్, ఫ్లాట్, ఇల్లు కొనాలనుకుంటున్నారా? సొంతింటిని నిర్మించాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI హోమ్ లోన్ వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది. ఏకంగా 6.95 శాతం వడ్డీకే ఇంటి రుణాలను అందిస్తోంది. జూలై 1 నుంచే కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. గత నెలలో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్‌-EBR, రెపో లింక్డ్ లెండింగ్ రేట్-RLLR ను ఎస్‌బీఐ 40 బేసిస్ పాయింట్స్ తగ్గించిన సంగతి తెలిసిందే. ఎస్‌బీఐలో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్‌-EBR 7.05 శాతం నుంచి 6.65 శాతానికి, రెపో లింక్డ్ లెండింగ్ రేట్-RLLR 6.65 శాతం నుంచి 6.25 శాతానికి దిగొచ్చాయి. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా బాగా తగ్గాయి.

Jio offer: జియో యూజర్లకు ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్... ప్లాన్స్ ఇవే



ఒకప్పుడు హోమ్ లోన్ తీసుకోవాలంటే వడ్డీ 9 శాతం పైనే ఉండేది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వడ్డీ రేట్లను తగ్గించడం హోమ్ లోన్ కస్టమర్లకు కలిసొస్తోంది. వడ్డీ రేటు 7 శాతం కన్నా తక్కువకు దిగొచ్చింది. ప్రస్తుతం ప్రస్తుతం ఎస్‌బీఐ 6.95 శాతం వడ్డీకి హోమ్ లోన్స్ అందిస్తోంది. ఎస్‌బీఐ మాత్రమే కాదు ఇతర బ్యాంకులు కూడా పోటాపోటీగా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 6.85 శాతానికి హోమ్ లోన్స్ ఇస్తోంది. ఇండస్ట్రీలో అతి తక్కువ హోమ్ లోన్ ఇస్తున్న మొదటి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడానే. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో స్థానంలో ఉంది.

ఎక్కువ లాభాలిచ్చే ఈ సేవింగ్ స్కీమ్ ఇవాళే ప్రారంభం

కస్టమర్ల ప్రొఫైల్, లోన్ మొత్తంపైన వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. వేతన జీవులకు 7 శాతం వడ్డీకి రూ.30 లక్షల వరకు లోన్ లభిస్తుంది. రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు లోన్ తీసుకోవాలంటే 7.25 శాతం వడ్డీ చెల్లించాలి. రూ.75 లక్షలు దాటితే 7.35 శాతం వడ్డీ చెల్లించాలి. మహిళా ఉద్యోగులకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే 6.95 శాతం వడ్డీకే హోమ్ లోన్ వస్తుంది.
First published: July 1, 2020, 3:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading