SBI Mega e-auction: ఇ-వేలం నిర్వహిస్తున్న ఎస్‌బీఐ... ఆ ఆస్తులను ఎలా కొనాలంటే

SBI Mega e-auction: ఇ-వేలం నిర్వహిస్తున్న ఎస్‌బీఐ... ఆ ఆస్తులను ఎలా కొనాలంటే (ప్రతీకాత్మక చిత్రం)

SBI Mega e-auction | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరోసారి మెగా ఇ-ఆక్షన్ నిర్వహిస్తోంది. అక్టోబర్ 25న జరిగే వేలం పాటలో ప్లాట్లు, ఫ్లాట్స్, ప్రాపర్టీస్‌ను అమ్మనుంది. మరి ఇ-ఆక్షన్‌లో ఎలా పాల్గొనాలో తెలుసుకోండి.

  • Share this:
మార్కెట్‌ ధర కంటే తక్కువ రేటుకే ఇల్లు, ప్లాటు లేదా దుకాణం కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అలాంటి వారికి ఒక అద్భుత అవకాశం కల్పిస్తోంది భారతదేశపు అతి పెద్ద రుణదాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI). ఎలక్ట్రానిక్‌ వేలం ద్వారా తమ దగ్గర తనఖా పెట్టిన నివాస, వాణిజ్య ఆస్తులను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank of India) ఈ నెల 25న వేలం (e-auction) వేస్తోంది. ఇందులో ఎవరైనా పాల్గొని తమ బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. ఆస్తులు తనఖా పెట్టి రుణాలు తీసుకొని వాయిదాలు చెల్లించకుండా డిఫాల్టర్లుగా మారిన వారి ఆస్తులను బ్యాంకు ఈ-ఆక్షన్‌ ద్వారా విక్రయిస్తోంది.

వేలంలో పాల్గొనేందుకు అర్హతలు


ఈ-ఆక్షన్‌ నోటీసులో పేర్కొన్న మొత్తంలో ఆయా ఆస్తికి సంబంధించిన ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) మొత్తం అవసరమవుతుంది. సంబంధిత ఎస్‌బీఐ బ్రాంచ్‌కు KYC పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కస్టమర్లకు చెల్లుబాటయ్యే డిజిటల్‌ సంతకం కూడా అవసరమవుతుంది. డిజిటల్‌ సంతకం పొందేందుకు బిడ్‌ దాఖలు చేయదలిచిన వారు ఆక్షన్‌ నిర్వహించేవారు లేదా అధీకృత ఏజెన్సీని సంప్రదించాలి. సంబంధిత బ్రాంచుకు ఈఎండీ డిపాజిట్‌, KYC పత్రాలు సమర్పించిన తర్వాత ఈ-ఆక్షనీర్స్‌ ద్వారా వారి ఈమెయిల్‌కు లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ పంపిస్తారు. వేలం నిబంధనలకు అనుగుణంగా ఈ-వేల సమయంలో బిడ్లుదాఖలు చేసేవారు తమ వేలం తెలపాల్సి ఉంటుంది.

IRCTC Tirumala Tour: విజయవాడ నుంచి రూ.3,220 ధరకే తిరుపతి టూర్ ప్యాకేజీ... శ్రీవారి ప్రత్యేక దర్శనం కూడా

బిడ్డింగ్‌లో పాల్గొనే ప్రక్రియ


బ్యాంకు పంపించిన ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా బిడ్‌ దాఖలు చేసేవారు పోర్టల్‌లో లాగ్‌ ఇన్‌ కావాల్సి ఉంటుంది. నియమ నిబంధనలు అంగీకరించిన తర్వాత బిడ్‌ దాఖలు చేసేవారు పార్టిసిపేట్‌ బటన్‌పై క్లిక్‌ చేసి ఆక్షన్‌లో పాల్గొనవచ్చు. పార్టిసిపేట్‌ బటన్‌పై క్లిక్‌ చేసిన తర్వాత KYC పత్రాలు, EMD వివరాలు, FRQ (ఫస్ట్‌ రేట్‌ కోట్‌ – కోట్‌ చేసే ధర) అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అవసరమైన అన్ని పత్రాలు అప్‌లోడ్‌ చేసిన తర్వాత బిడ్‌ దాఖలు చేసేవారు తమ ధరను సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. ఆ ఆస్తికి సంబందించి రిజర్వ్‌ చేసిన ధరకు సమానంగా లేదా అంత కంటే ఎక్కువగా కూడా ఈ కోట్‌ ధర ఉండవచ్చు.

Electricity Bills: కరెంట్ బిల్ కట్టాలా? ఈ యాప్స్‌తో ఈజీగా బిల్ చెల్లించండి ఇలా

కోట్‌ చేసే ధర పిల్‌ చేసిన తర్వాత సబ్మిట్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఫైనల్‌ బిడ్‌ సమర్పించేందుకు ఫైనల్‌ సబ్మిట్‌పై క్లిక్‌ చేయాలి. ఫైనల్‌ సబ్మిషన్‌ చేసిన తర్వాత బిడ్‌ దాఖలు చేసేవారు అప్‌లోడ్‌ చేసిన డాక్యుమెంట్లలో కాని లేదా కోట్‌ చేసిన ధరలోగాని మార్పులు చేయడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి. నిర్దేశించిన సమయంలోపు బిడ్‌ దాఖలు చేసేవారు ఫైనల్‌ సబ్మిట్‌ బటన్‌ క్లిక్‌ చేయలేకపోతే వారు ఆక్షన్‌లో పాల్గొనడం కుదరదు.

బ్యాంకు దగ్గర తనఖా పెట్టిన ఆస్తులు/వేలం వేయమని కోర్టు ద్వారా వచ్చిన ఆదేశాలను బట్టి తాము చాలా పారదర్శకంగా వేలం నిర్వహిస్తామని ఎస్‌బీఐ ప్రకటించింది. ఆస్తులకు సంబంధించిన అన్ని వివరాలు తాము పొందుపరుస్తామని తెలియజేసింది. ఏదైనా వివరణ కోసం ఆక్షన్ జరిగే ప్రాంతాల్లోని తమ శాఖలను సంప్రదించవచ్చని ఎస్‌బీఐ సూచించింది.
Published by:Santhosh Kumar S
First published: