• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • STATE BANK OF INDIA SBI AXIS BANK KOTAK MAHINDRA BANK REDUCED INTEREST RATES ON HOME LOAN SS GH

SBI Home Loan: హోమ్ లోన్ కస్టమర్లకు బంపరాఫర్... వడ్డీ తగ్గించుకోండి ఇలా

SBI Home Loan: హోమ్ లోన్ కస్టమర్లకు బంపరాఫర్... వడ్డీ తగ్గించుకోండి ఇలా

SBI Home Loan: హోమ్ లోన్ కస్టమర్లకు బంపరాఫర్... వడ్డీ తగ్గించుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI Home Loan | హోమ్ లోన్ తీసుకోవాలనుకునేవారికి శుభవార్త. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు భారీగా హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గించాయి.

  • Share this:
    పండుగ సీజన్ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థలు కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకులు హోమ్ లోన్ కస్టమర్లకు బంపరాఫర్‌ను ప్రకటించాయి. దీనిలో భాగంగా హోంలోన్ వడ్డీ రేట్లపై భారీ రాయితీలను ప్రకటించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోంలోన్ వడ్డీ రేట్లపై 25 బేసిస్ పాయింట్ల (బిపిఎస్) రాయితీని కల్పించనున్నట్లు ప్రకటించింది. కస్టమర్ల సిబిల్ స్కోరు ఆధారంగా ఈ రాయితీ ఇస్తామని వెల్లడించింది. అయితే రూ.75 లక్షలకు పైబడిన గృహ రుణాలకు గాను ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే ఇది వర్తిస్తుందని ఎస్‌బీఐ ప్రకటించింది.

    LIC new plan: ఎల్ఐసీ నుంచి సరికొత్త పాలసీ... ఈ ప్లాన్‌తో ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులు

    Jewel Utsav Diwali Sale: ఇంట్లో కూర్చొని మీకు నచ్చిన నగలు భారీ డిస్కౌంట్‌తో కొనండి

    కాగా, పండుగ ఆఫర్లో భాగంగా ఇటీవల ఎస్‌బీఐ క్రెడిట్ స్కోరు ఆధారిత రాయితీని 10 బిపిఎస్ నుంచి 20 బిపిఎస్‌కు పెంచిన విషయం తెలిసిందే. అయితే, ఇది 30 లక్షల నుండి 2 కోట్ల వరకు తీసుకున్న గృహ రుణాలకే వర్తిస్తుందని ప్రకటించింది. ఎనిమిది మెట్రో నగరాల్లో రూ.3 కోట్ల వరకు తీసుకున్న గుహ రుణాలపై కూడా ఇదే రాయితీ వర్తిస్తుంది తెలిపింది. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి, మహిళా రుణగ్రహీతలకు అదనంగా మరో 5 బిపిఎస్ వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. కాగా, ఎస్‌బీఐ ప్రస్తుతం 30 లక్షల వరకు తీసుకునే గృహ రుణాలపై 6.90% మరియు రూ.30 లక్షలకు పైన తీసుకునే గృహ రుణాలకు 7% వడ్డీ రేటును అమలు చేస్తుంది. "గృహ రుణాలపై ఎస్‌బీఐ అమలు చేస్తున్న అతి తక్కువ వడ్డీ రేటుతో కస్టమర్లు తమ సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి దోహదపడుతుందని మేము నమ్ముతున్నాము" అని ఎస్‌బీఐ రిటైల్ మరియు డిజిటల్ బ్యాంకింగ్ ఎండి సీఎస్ సెట్టి అన్నారు.

    Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే లాభం

    EPF Account Transfer: మీ ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

    కోటక్ మహీంద్రాలో 6.9 శాతం వడ్డీ


    ఈ పండుగ సీజన్లో కోటక్ మహీంద్రా బ్యాంకు కూడా గృహ రుణాలపై వడ్డీ రేట్లను మరో 10 బిపిఎస్ తగ్గించింది. దీంతో కస్టమర్లు ప్రస్తుతం 6.9 శాతానికే గృహ రుణాలను పొందవచ్చు. అంతేకాక మహిళా రుణగ్రహీతలు లోన్ ప్రోడక్ట్స్‌లో ప్రత్యేక రేట్లను కూడా పొందవచ్చు. కోటక్‌తో పాటు ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కూడా సంవత్సరానికి 6.9% నుండి గృహ రుణాలను అందిస్తోంది. కోవిడ్-19 కారణంగా గత కొన్ని నెలలుగా స్థబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం తిరిగి పుంజుకుంటుందని, తద్వారా ఈ పండుగ సీజన్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో నూతనోత్సాహం కనిపిస్తోందని, దీని ప్రకారం గత మూడు నెలల్లో నివాస గృహ అమ్మకాలు మొత్తం 35,132 యూనిట్లకు చేరుకున్నాయని, ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 85% పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు