హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Alert: అలర్ట్... ఈ పనిచేయకపోతే ఏప్రిల్ 1 నుంచి మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డ్, క్రెడిట్ కార్డ్ పనిచేయవు

SBI Alert: అలర్ట్... ఈ పనిచేయకపోతే ఏప్రిల్ 1 నుంచి మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డ్, క్రెడిట్ కార్డ్ పనిచేయవు

SBI Alert | ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్. ఏప్రిల్ 1 నుంచి మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డ్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ (SBI Credit Card) పనిచేయాలన్నా, ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయాలన్నా ముందు వెంటనే ఈ పనిచేయండి.

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమరా? ఎస్‌బీఐ ఏటీఎం కార్డ్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే అలర్ట్. ఏప్రిల్ 1 నుంచి మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డ్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పనిచేయకపోవచ్చు. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా (ATM Cash Withdrawal) చేయడం కూడా సాధ్యం కాకపోవచ్చు. ఇందుకు కారణం మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోవడమే. బ్యాంక్ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ అయి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను చట్టం-1961 లోని సెక్షన్ 139AA ప్రకారం పాన్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ లింక్ (PAN Aadhaar Link) చేయడం తప్పనిసరి. పాన్, ఆధార్ లింక్ చేయడానికి 2022 మార్చి 31 వరకు గడువు ఉంది. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ అనేక సార్లు గడువు పెంచింది. ఈసారి గడువు పెంచుతుందో లేదో తెలియదు.

ఎస్‌బీఐ కస్టమర్లు తమ పాన్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో మార్చి 31 లోగా లింక్ చేయాలని బ్యాంకు కోరుతోంది. బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కస్టమర్లు తప్పనిసరిగా రెండు డాక్యుమెంట్స్ లింక్ చేయాలని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. ఒకవేళ ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ ఇనాపరేటీవ్, ఇనాక్టీవ్‌గా మారుతుందని, పాన్ కార్డ్ తప్పనిసరిగా కావాల్సిన లావాదేవీలు చేయడం సాధ్యం కాదని ఎస్‌బీఐ వివరించింది.

PAN Aadhaar Link: పాన్ ఆధార్ లింక్ చేయలేకపోతున్నారా? వివరాలు ఇలా సరిదిద్దుకోండి

ఎస్‌బీఐ కార్డ్ కూడా తమ క్రెడిట్ కార్డ్ కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కోసం ఇచ్చిన పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ కార్డ్ ఇనాపరేటీవ్‌గా మారుతుందని, క్రెడిట్ కార్డ్ సేవలు పొందేందుకు మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌లో ఉండాలని ఎస్‌బీఐ కార్డ్ వివరించింది. పాన్ ఆధార్ లింక్ చేయకపోతే రూ.10,000 జరిమానా కూడా చెల్లించాల్సి రావొచ్చు.

PAN Card: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఈ చిన్న తప్పుతో రూ.10,000 ఫైన్ తప్పదు

అంతేకాదు... మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టైతే మీ పాన్ కార్డును ఆధార్ నెంబర్‌తో లింక్ చేయకపోతే సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) నిలిచిపోయే అవకాశం ఉంది. మీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న డబ్బుల్ని రీడీమ్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. ఇప్పటికే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఇన్వెస్టర్లను అప్రమత్తం కూడా చేసింది.

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినవారిలో 20 నుంచి 30 లక్షల పాన్ కార్డ్ హోల్డర్లు ఇంకా తమ ఆధార్ నెంబర్ లింక్ చేయలేదని లెక్కలు చెబుతున్నాయి. సెబీ ఆదేశాల ప్రకారం కొత్తగా డీమ్యాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలి.

First published:

Tags: Aadhaar Card, PAN card, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు