SBI ATM Card: డిసెంబర్ 31 లోగా పాత ఏటీఎం కార్డులు మార్చుకోండి... ఎస్‌బీఐ ట్వీట్

ATM Card | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలతో బ్యాంకులన్నీ ఏటీఎం కార్డుల్ని అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డుల కన్నా ఈఎంవీ చిప్ కార్డులకే సెక్యూరిటీ ఎక్కువ.

news18-telugu
Updated: December 28, 2019, 10:48 AM IST
SBI ATM Card: డిసెంబర్ 31 లోగా పాత ఏటీఎం కార్డులు మార్చుకోండి... ఎస్‌బీఐ ట్వీట్
SBI ATM Card: డిసెంబర్ 31 లోగా పాత ఏటీఎం కార్డులు మార్చుకోండి... ఎస్‌బీఐ ట్వీట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు అలర్ట్ కావాల్సిన సమయం ఇది. మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎం కార్డు ఉంటే ఓసారి చెక్ చేసుకోండి. మీరు ఇంకా పాత ఏటీఎం కార్డు ఉపయోగిస్తున్నట్టైతే ఆ కార్డు జనవరి 1 నుంచి పనిచేయదు. డిసెంబర్ 31 లోగా పాత కార్డు మార్చాల్సిందే. మీ కార్డుపై వేలిడిటీ ఉన్నా కార్డు మాత్రం పనిచేయదు. ఆ కార్డుతో మీరు డబ్బులు డ్రా చేయలేరు. ఎక్కడా పేమెంట్స్ చేయడం కూడా సాధ్యం కాదు. అసలు ఆ కార్డు మీరు ఎక్కడా ఉపయోగించలేరు. మీరు బ్యాంకులో కొత్త కార్డు తీసుకుంటే తప్ప కార్డును ఉపయోగించలేరు. ఇందుకు కారణం మీరు పాత ఏటీఎం కార్డు ఉపయోగిస్తుండటమే. సైబర్ మోసాలు, కార్డు మోసాలు పెరిగిపోతున్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలతో బ్యాంకులన్నీ ఏటీఎం కార్డుల్ని అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డుల కన్నా ఈఎంవీ చిప్ కార్డులకే సెక్యూరిటీ ఎక్కువ. ఇంతకుముందు మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డులను కస్టమర్లకు ఇచ్చిన బ్యాంకులు... కొంతకాలంగా ఈఎంవీ చిప్ ఉన్న కార్డుల్ని మాత్రమే ఇస్తున్నాయి. పాత కార్డులు మార్చుకోవాలని కస్టమర్లను కోరుతున్నాయి. కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసేవారికి ఈఎంవీ చిప్ కార్డులనే ఇస్తున్నాయి.





స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈఎంవీ చిప్ కార్డులు తీసుకోవాలని కస్టమర్లను చాలాకాలంగా కోరుతోంది. డిసెంబర్ 31 లోగా కార్డులు మార్చుకోవాలని కొంతకాలంగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికీ మ్యాగ్నెట్‌స్ట్రైప్ కార్డులు ఉపయోగిస్తున్న కస్టమర్లు వెంటనే కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి. లేకపోతే జనవరి 1 నుంచి పాతకార్డులు పనిచేయక ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. ఒకవేళ ఇప్పటికే మీరు ఈఎంవీ చిప్ కార్డు వాడుతున్నట్టైతే సమస్యే లేదు. మీ ఏటీఎం కార్డులో ఈఎంవీ చిప్ లేకపోతే కొత్తది తీసుకోవాలి. మీరు కొత్త కార్డు తీసుకునేప్పుడు బ్యాంకులో సరైన అడ్రస్ ఇవ్వాలి. 10 నుంచి 15 రోజుల్లో మీకు కొత్త కార్డు వస్తుంది. మ్యాగ్నెట్ స్ట్రైప్ కార్డు నుంచి ఈఎంవీ చిప్ కార్డుకు మారడానికి మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్‌బీఐ ఉచితంగానే కొత్త కార్డు ఇస్తుంది.

Realme x2 pro: అదిరిపోయిన రియల్‌మీ ఎక్స్‌2 ప్రో' మాస్టర్ ఎడిషన్... ఫోన్ ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

2020 Bank Holidays: బ్యాంకులకు వచ్చే ఏడాది సెలవులు ఎప్పుడో తెలుసుకోండి

Alert: చెక్ పైన డేట్ రాస్తున్నారా? 2020 లో జాగ్రత్త... ఎందుకో తెలుసా?

SBI Gold Scheme: మీ నగలు డిపాజిట్ చేస్తే ఎస్‌బీఐ నుంచి వడ్డీ... ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి
First published: December 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు