SBI Scheme: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెల అకౌంట్‌లోకి డబ్బులు

SBI Annuity Deposit Scheme | డిపాజిట్లపై ఎస్‌బీఐ నిర్ణయించిన వడ్డీ రేట్లే ఈ స్కీమ్‌కు వర్తిస్తాయి. ప్రస్తుతం 6.25 % శాతం వడ్డీ పొందొచ్చు. ఈ స్కీమ్‌కు రుణ సదుపాయం కూడా ఉంది.

news18-telugu
Updated: November 15, 2019, 5:54 PM IST
SBI Scheme: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెల అకౌంట్‌లోకి డబ్బులు
SBI Scheme: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెల అకౌంట్‌లోకి డబ్బులు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత నెలనెలా కొంత మొత్తం పొందాలనుకుంటున్నారా? మీలాంటివాళ్ల కోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ప్రకటించింది. ఇందులో ఒకేసారి డబ్బులు పెడితే... ప్రతీ నెల మీరు కోరుకున్న మొత్తాన్ని తిరిగి పొందొచ్చు. దాంతోపాటు మీకు వడ్డీ కూడా లభిస్తుంది. ఒకేసారి పెద్దమొత్తంలో డిపాజిట్ చేసి, ప్రతీ నెల డబ్బులు కావాలనుకునేవారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. సింగిల్‌గా లేదా జాయింట్ అకౌంట్ కూడా తెరవొచ్చు. గరిష్టంగా ఎంత ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన ఏమీ లేదు. కనీసం రూ.25,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కనీసం మంత్లీ యాన్యుటీ రూ.1,000 నుంచి పొందొచ్చు.





ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌‌లో 36, 64, 84 లేదా 120 నెలలు కాల వ్యవధి ఎంచుకోవాల్సి ఉంటుంది. డిపాజిట్లపై ఎస్‌బీఐ నిర్ణయించిన వడ్డీ రేట్లే ఈ స్కీమ్‌కు వర్తిస్తాయి. ప్రస్తుతం 6.25 % శాతం వడ్డీ పొందొచ్చు. ఈ స్కీమ్‌కు రుణ సదుపాయం కూడా ఉంది. మీ డిపాజిట్‌లో ఉన్న బ్యాలెన్స్ నుంచి 75% వరకు లోన్ తీసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బ్రాంచ్ మేనేజర్ విచక్షణపై ఇది ఆధారపడి ఉంటుంది. లోన్ తీసుకున్న తర్వాత యాన్యుటీ పేమెంట్ లోన్ అకౌంట్‌లో డిపాజిట్ అవుతుంది. డిపాజిటర్ చనిపోతే ప్రీమెచ్యూర్ పేమెంట్ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌కు నామినేషన్ సదుపాయం కూడా ఉంది.

మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్... ఎలా మడతపెట్టొచ్చో చూశారా?
Loading...


ఇవి కూడా చదవండి:

IRCTC: రైల్వే ప్రయాణికులకు 49 పైసలకే రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్ ఇస్తున్న ఐఆర్‌సీటీసీ

Pradhan Mantri Awas Yojana: మహిళలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో లాభమిదే

SBI Alert: ఈ తప్పుతో మీ డబ్బులు పోతే బ్యాంకుకు సంబంధం లేదంటున్న ఎస్‌బీఐ
First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com