మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? ఎస్బీఐలో ఏదైనా లోన్ తీసుకున్నారా? ప్రతీ నెల ఈఎంఐ చెల్లిస్తున్నారా? కస్టమర్లందరికీ ఎస్బీఐ ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. భారతదేశంలో కరోనా వైరస్ సంక్షోభం కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కోవిడ్ 19 రెగ్యులేటరీ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్యాకేజీలో భాగంగా అన్ని రకాల లోన్ల ఈఎంఐలపై మూడు నెలలు మారటోరియం విధించింది ఆర్బీఐ. అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆ తర్వాత బ్యాంకులు వరుసగా తమ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ కస్టమర్లకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ట్విట్టర్లో పలు విషయాలను వెల్లడించింది. 2020 మార్చి 1 నుంచి 2020 మే 31 వరకు అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలు, వడ్డీని వాయిదా వేసేందుకు చర్యలు తీసుకున్నామని ఎస్బీఐ తాజాగా ప్రకటించింది. రీపేమెంట్ పీరియడ్‌ను మూడు నెలలు పొడిగించినట్టు చెప్పింది.
Important announcement for all SBI customers.@guptapk @DFS_India @DFSFightsCorona#Announcement #SBI #StateBankOfIndia pic.twitter.com/hEWSXVxVIp
— State Bank of India (@TheOfficialSBI) March 31, 2020
ఎస్బీఐలో టర్మ్ లోన్స్ అంటే హోమ్, పర్సనల్, ఎడ్యుకేషన్, ఆటో లాంటి రుణాలు తీసుకున్నవారు మూడు నెలలపాటు ఈఎంఐలు చెల్లించకపోయినా పర్వాలేదు. వారి క్రెడిట్ స్కోర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగదు. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నవారికి ఊరట కలిగించే నిర్ణయమిది. వర్కింగ్ క్యాపిటల్‌పై 2020 మార్చి 1 నుంచి 2020 మే 31 వరకు వడ్డీని 2020 జూన్ 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించింది ఎస్బీఐ.
ఇవి కూడా చదవండి:
COVID-19 Insurance: కరోనా వైరస్ ఇన్స్యూరెన్స్ రూ.50 లక్షలు... ఎవరెవరికంటే
Work From Home: ఈ 9 టిప్స్‌తో మీ వైఫై స్పీడ్ పెంచుకోండి
JioPhone: జియోఫోన్ యూజర్లకు శుభవార్త... 10 రెట్లు లాభాలివే తెలుసుకోండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank account, Bank loans, Banking, Corona, Corona virus, Coronavirus, Covid-19, Home loan, Housing Loans, Lockdown, Personal Loan, Reserve Bank of India, Sbi, State bank of india