హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు బ్యాంకు ముఖ్య గమనిక

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు బ్యాంకు ముఖ్య గమనిక

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు బ్యాంకు ముఖ్య గమనిక
(ప్రతీకాత్మక చిత్రం)

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు బ్యాంకు ముఖ్య గమనిక (ప్రతీకాత్మక చిత్రం)

SBI Debit Card | దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా ఏటీఎం కార్డుల డెలివరీలో జాప్యం ఉంటుందని ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI.

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? ఎస్‌బీఐ డెబిట్ కార్డు కోసం అప్లై చేశారా? మీ పాత ఏటీఎం కార్డు బదులు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేశారా? అయితే డెబిట్ కార్డుల డెలివరీ ఆలస్యం అవుతుందని ఎస్‌బీఐ ప్రకటించింది. కరోనా వైరస్ లాక్‌డౌన్, ఆంక్షల కారణంగా డెబిట్ కార్డుల డెలివరీలో జాప్యం ఉంటుందని ఎస్‌బీఐ వెల్లడించింది. ఒకవేళ మీరు డెబిట్ కార్డు కోసం అప్లై చేసినట్టైతే ఇంకొన్ని రోజులు ఎదురుచూపులు తప్పవు. అయితే కస్టమర్లు డిజిటల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగించుకోవాలని, బ్యాంకు బ్రాంచ్‌లకు రావొద్దని సూచిస్తోంది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా బ్యాంకుల టైమింగ్స్ మారాయి. తక్కువ మంది ఉద్యోగులతో బ్యాంకులు నడుస్తున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నారు. కాబట్టి కస్టమర్లు అత్యవసరమైతే తప్ప బ్యాంకుకు వెళ్లకూడదు.

ఒకవేళ మీరు ఇప్పుడు కొత్త డెబిట్ కార్డుకు దరఖాస్తు చేయాలంటే సులువుగా అప్లై చేయొచ్చు. ఇందుకోసం ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. e-Services ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ATM card services ఓపెన్ చేయాలి. తర్వాత Request ATM/debit card ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ సేవింగ్స్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని కొత్త ఏటీఎం కార్డుకు అప్లై చేయాలి. ఎలాంటి ఏటీఎం కార్డు కావాలో సెలెక్ట్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.

ఇవి కూడా చదవండి:

SBI Mobile Banking: ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్‌కు రిజిస్టర్ చేయండి ఇలా

PF Balance: పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీస్తున్నారా? ఎంత నష్టమంటే

EPF: రూ.15,000 లోపు జీతం ఉన్నవారికి త్వరలో గుడ్ న్యూస్?

First published:

Tags: Business, BUSINESS NEWS, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు