SBI Home Loan: దసరా ముందు ఎస్‌బీఐ గుడ్ న్యూస్... 8.15% వడ్డీ రేటుతో హోమ్ లోన్

SBI Home Loan | అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చేలా కొత్త హోమ్ లోన్ స్కీమ్‌ను రూపొందిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు దేశమంతా పండుగ సీజన్ ప్రారంభం కావడంతో కొత్త హోమ్ లోన్ పథకాన్ని ప్రారంభించింది.

news18-telugu
Updated: September 27, 2019, 5:30 PM IST
SBI Home Loan: దసరా ముందు ఎస్‌బీఐ గుడ్ న్యూస్... 8.15% వడ్డీ రేటుతో హోమ్ లోన్
SBI Home Loan: దసరా ముందు ఎస్‌బీఐ గుడ్ న్యూస్... 8.15% వడ్డీ రేటుతో హోమ్ లోన్ (image: SBI)
  • Share this:
ఇల్లు కొనాలనుకుంటున్నారా? అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ బుక్ చేస్తున్నారా? దసరా పండుగకు ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన శుభవార్త చెప్పింది. హోమ్ లోన్ వడ్డీ రేటు 8.15% అని ప్రకటించింది. హోమ్ లోన్ ఇండస్ట్రీలోనే ఇది అతి తక్కువ వడ్డీ రేటు. ఇప్పటి వరకు ఏ బ్యాంకు, ఏ సంస్థ హోమ్ లోన్‌కు ఇంత తక్కువ వడ్డీ ఆఫర్ చేయలేదు. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్‌ సిస్టమ్ పేరుతో ఈ వడ్డీ రేట్లను ప్రకటించింది ఎస్‌బీఐ. కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. అక్టోబర్ 1 నుంచి హోమ్ లోన్‌కు దరఖాస్తు చేసుకునేవాళ్లు తక్కువగా 8.15% వడ్డీ రేటుకే ఇంటి రుణం పొందొచ్చు. అయితే ఈ వడ్డీ రేటు పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలన్న నియమ నిబంధనల్ని ఎస్‌బీఐ వెల్లడించాల్సి ఉంది.



కొద్దిరోజుల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ ప్రకటించిన విషయం తెలిసింది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించే రెపో రేట్‌ను బట్టి ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఉండేలా రూపొందించిన స్కీమ్ ఇది. ఆ తర్వాత ఈ స్కీమ్‌ను వెనక్కి తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చేలా కొత్త హోమ్ లోన్ స్కీమ్‌ను రూపొందిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు దేశమంతా పండుగ సీజన్ ప్రారంభం కావడంతో కొత్త హోమ్ లోన్ పథకాన్ని ప్రారంభించింది. దసరా, దీపావళి సమయంలో సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలనుకునేవారికి అద్భుతమైన అవకాశమిది.

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

SBI offer: ఎస్‌బీఐ కార్డు ఉందా? అమెజాన్ సేల్‌లో రూ.10,000 బెనిఫిట్స్ పొందండి ఇలా

Dussehra Sale: మీకు సెల్ఫీలు ఇష్టమా? దసరా సేల్‌లో ఈ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్స్

Smartphone offer: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.10,000 లోపు బెస్ట్ 20 స్మార్ట్‌ఫోన్లు ఇవే...
Published by: Santhosh Kumar S
First published: September 27, 2019, 5:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading