STATE BANK OF INDIA SBI ANNOUNCED DISOUNTS ON RAKSHA BANDHAN SHOPPING NS
SBI Raksha Bandhan Offer: ఎస్బీఐ కస్టమర్లకు బంపరాఫర్.. రక్షా బంధన్ సందర్భంగా భారీ డిస్కౌంట్లు.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
రక్షాబంధన్ సందర్భంగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాదాాదారులకు శుభవార్త చెప్పింది. షాపింగ్ పై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో ఇన్నాళ్లు ఇబ్బంది పడిన ప్రజలు కేసులు కాస్త తగ్గడంతో ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ సమయంలో స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పౌర్ణమి రావడంతో ప్రస్తుతం దేశంలో పండగ వాతావరణం నెలకొంది. దీనికి తోడు వివిధ బ్యాంకులు, వ్యాపార సంస్థలు ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రక్షా బంధన్ కొనుగోళ్లపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. యోనో యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 20 శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో తమ కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్ చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించింది. ఫెర్న్స్ యాంట్ పెటల్స్ కంపెనీకి చెందిన బహుమతి కొనుగోలు చేసిన కస్టమర్లు 20 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చని SBI తెలిపింది. అయితే.. ఎంత తక్కువ మొత్తంలో షాపింగ్ చేసినా ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని SBI స్పష్టం చేసింది. అయితే.. గరిష్టంగా డిస్కౌంట్ రూ. 999 వరకు మాత్రమే ఉంటుంది. యోనో యాప్ ద్వారా షాపింగ్ చేసిన వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. SBI Home Loan: కొత్త ఇల్లు కొనాలనుకుంటున్న వారికి SBI శుభవార్త.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బంపరాఫర్
యోనో యాప్ ద్వారా చెల్లింపులు చేసిన వారికే ఈ డిస్కౌంట్ అందుతుంది. వినియోగదారులు ఈ ఆఫర్‌కి సంబంధించి ఏదైనా సందేహాలుంటే ఉంటే.. SBI YONO, sbiyono.sbi అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎస్బీఐ సూచించింది. యోనో SBI యాప్ లేని వారు sbiyono.sbi/index.html ఈ లింక్ తో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఎస్బిఐ ట్వీట్ చేసింది. ఈ ఆఫర్ రాఖి పండగ అయిన ఆగస్టు 22 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ తెలిపింది. SBI20 కోడ్ ను ఉపయోగించి షాప్ చేస్తే డిస్కౌంట్ అందుకోవచ్చు.
మరో ఆఫర్ కూడా..
జీవన్‌శైలి స్టోర్.కామ్ నుండి వస్తువుల కొనుగోలుపై కూడా 60% వరకు తగ్గింపు అందుకోవ్చని SBI తెలిపింది. డ్రెస్సులతో సహా ఈ స్టోర్ నుండి లగ్జరీ వస్తువులు, ఫ్యాషన్ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించిన డబ్బులను మాత్రం యోనో యాప్ ద్వారా చెల్లింపులు చేస్తే 5 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.