SBI: ఎస్బీఐ కస్టమర్లకు షాక్... నవంబర్ 10 నుంచి కొత్త వడ్డీ రేట్లు
SBI Interest Rates 2019 | కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 10 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది ఎస్బీఐ.
news18-telugu
Updated: November 8, 2019, 1:13 PM IST

SBI: ఎస్బీఐ కస్టమర్లకు షాక్... నవంబర్ 10 నుంచి కొత్త వడ్డీ రేట్లు (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: November 8, 2019, 1:13 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు షాకిచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఏకంగా 15 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు తగ్గించడం డిపాజిటర్లకు పెద్ద షాకే. రూ.2 కోట్ల లోపు 1 ఏడాది నుంచి 2 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 6.40 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది. మిగతా కాలవ్యవధుల డిపాజిట్లపై వడ్డీ రేట్లలో పెద్దగా మార్పు లేదు. ఇక రూ.2 కోట్ల పైన ఫిక్స్డ్ డిపాజిట్లపై భారీగా తగ్గాయి. 46 నుంచి 179 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.30 శాతం నుంచి 4.75 శాతానికి వడ్డీ రేటును తగ్గించింది. 180 రోజుల నుంచి ఏడాది వరకు ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీ 5.70 శాతం నుంచి 5.25 శాతానికి వడ్డీ రేటు తగ్గింది. ఒక ఏడాది నుంచి 3 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.00 శాతం నుంచి 5.25 శాతానికి తగ్గింది. 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.75 శాతం నుంచి 5.25 శాతానికి వడ్డీ రేటు తగ్గింది. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినవారికి తక్కువ వడ్డీ రానుంది.
ఇక అన్ని కాలవ్యవధులపై మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్స్-MCLR 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి 8.20 శాతానికి తగ్గింది. ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 8.05 శాతం నుంచి 8 శాతానికి తగ్గింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ 7.70 శాతం నుంచి 7.65 శాతానికి తగ్గింది. 6 నెలల కాలవ్యవధిపై ఎంసీఎల్ఆర్ 7.90 శాతం నుంచి 7.85 శాతానికి, 2 ఏళ్ల ఎంసీఎల్ఆర్పై 8.15 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గించింది ఎస్బీఐ. దీంతో రుణాలు తీసుకునేవారికి తక్కువ వడ్డీ రేట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 10 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది.
Mi Organic T-shirt: షావోమీ నుంచి ఆర్గానిక్ టీ-షర్ట్స్... ఎలా ఉన్నాయో చూడండి
ఇవి కూడా చదవండి:
IRCTC: గుడ్ న్యూస్... హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ రామాయణ యాత్ర
Indian Railways: రైలు పట్టాలపై ప్రత్యక్షమైన యముడు... బెదిరిపోయిన ప్రయాణికులుCredit Card: మీ క్రెడిట్ కార్డుపై లిమిట్ తక్కువగా ఉంటే పెంచుకోండి ఇలా

SBI Loan: కస్టమర్లకు గుడ్ న్యూస్... ఎస్బీఐలో తగ్గనున్న మీ ఈఎంఐ
Pradhan Mantri Awas Yojana: మహిళలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో లాభమిదే
SBI Card: ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... డబ్బులు లేకపోయినా షాపింగ్ చేయొచ్
SBI Home Loan: దసరా ముందు ఎస్బీఐ గుడ్ న్యూస్... 8.15% వడ్డీ రేటుతో హోమ్ లోన్
గుడ్ న్యూస్.. చిన్న వ్యాపారులకు కోటి రూపాయల లోన్