స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI హోమ్ లోన్ తీసుకున్న కస్టమర్లతో పాటు, ఇంటి రుణాలు తీసుకోబోయే కస్టమర్లకు శుభవార్త. హోమ్ లోన్ కస్టమర్లకు ఎస్బీఐ వరుసగా గుడ్ న్యూస్ చెబుతోంది. ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్న కస్టమర్లకు ఎంసీఎల్ఆర్ రీసెట్ చేసుకునే అవకాశాన్ని ఏడాది నుంచి ఆరు నెలలకు తగ్గించిన ఎస్బీఐ... కొత్తగా ఇంటి రుణాలు తీసుకోవాలనుకునేవారికి మూడు ఆఫర్స్ ప్రకటించింది. అందులో మొదటిది ప్రాసెసింగ్ ఫీజు లేకపోవడం. అంటే హోమ్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సాధారణంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.10,000 నుంచి రూ.30,000 వరకు ఉంటుంది. ఇక రెండో ఆఫర్ విషయానికి వస్తే సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్న కస్టమర్లకు వడ్డీని 0.10% శాతం తగ్గించనుంది. రూ.30 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలు తీసుకునేవారికి ఇది వర్తిస్తుంది. ఇక మూడో ఆఫర్ విషయానికి వస్తే ఎస్బీఐ యోనో యాప్‌లో హోమ్ లోన్ అప్లై చేస్తే 0.05% శాతం వడ్డీ తగ్గుతుంది.
బ్యాంకులో ఖాతా ఉందా? అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త సర్వీసులు మీకోసమే
EPFO new rule: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... ఇన్స్యూరెన్స్ బెనిఫిట్ పెరిగింది
ప్రస్తుతం ఎస్బీఐలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు చూస్తే సాలరీడ్ కస్టమర్లకు 6.95 శాతం నుంచి 7.45 శాతం వరకు, స్వయం ఉపాధి పొందేవారికి 7.10 శాతం నుంచి 7.60 శాతం వరకు ఉన్నాయి. అన్ని కొత్త హోమ్ లోన్స్ అన్నీ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్-EBR ప్రకారం ఉంటాయి. ప్రస్తుతం ఈబీఆర్ 6.65 శాతంగా ఉంది. ఈబీఆర్ రెపో రేట్‌కు లింక్ అయి ఉంటుంది. ఇక ఇప్పటికే ఎంసీఎల్ఆర్ లేదా బీపీఎల్ఆర్ లింక్డ్ హోమ్ లోన్స్ తీసుకున్నవారు వడ్డీ రేట్లను రీసెట్ చేసుకోవచ్చు. గతంలో ఏడాదికి ఓసారి వడ్డీ రేట్లను రీసెట్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆరు నెలలకోసారి వడ్డీ రేట్లు రీసెట్ చేసుకోవచ్చు. రెపో రేట్ తగ్గినప్పుడల్లా ఎంసీఎల్ఆర్ తగ్గుతుంది. కాబట్టి కస్టమర్లు రెపో రేట్ తగ్గినప్పుడు వడ్డీ రీసెట్ చేసుకొని ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:September 11, 2020, 14:24 IST