SBI Savings Account: ఎస్‌బీఐ అకౌంట్ ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయండి ఇలా

SBI Savings Account: ఎస్‌బీఐ అకౌంట్ ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI Digital Savings Account | మీరు ఎస్‌బీఐలో అకౌంట్ ఓపెన్ చేద్దామనుకుంటున్నారా? బ్యాంకుకు వెళ్లకుండా ఇంటి నుంచే అకౌంట్ (SBI Account) ఓపెన్ చేయొచ్చు. ఎస్‌బీఐ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)... భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది. 22,000 పైగా బ్రాంచ్‌లతో 45 కోట్లకు పైగా కస్టమర్లకు సేవల్ని అందిస్తోంది ఎస్‌బీఐ. టెక్నాలజీని ఉపయోగించుకొని డిజిటల్ బ్యాంకింగ్ (Digital Banking) సేవల్ని అందిస్తోంది బ్యాంకు. కస్టమర్లకు ఆన్‌లైన్‌లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఎస్‌బీఐ కస్టమర్లు కేవలం కొన్ని ఈజీ స్టెప్స్‌తో ఆన్‌లైన్‌లో సేవింగ్స్ అకౌంట్ (Savings Account) తెరవొచ్చు. ఆన్‌లైన్‌లోనే కేవైసీ ప్రాసెస్ జరుగుతుంది. అయితే కస్టమర్లు కేవైసీ వెరిఫికేషన్ కోసం ఒక్కసారి మాత్రమే బ్రాంచ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మరి మీరు ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలో తెలుసుకోండి.

    Online Fraud: ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్నారా? 10 రోజుల్లో వెనక్కి పొందొచ్చు ఇలా

    ఆన్‌లైన్‌లో అకౌంట్ ఓపెన్ చేయండి ఇలా


    Step 1- ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వెబ్‌సైట్ https://sbi.co.in/ ఓపెన్ చేయండి.

    Step 2- హోమ్ పేజీలో Accounts సెక్షన్‌లో Savings Bank Account పైన క్లిక్ చేయాలి.

    Step 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అకౌంట్ వివరాలు ఉంటాయి.

    Step 4- అకౌంట్ వివరాలు చెక్ చేసిన తర్వాత Apply Now పైన క్లిక్ చేయాలి.

    Step 5- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Apply Now పైన క్లిక్ చేయాలి.

    Step 6- మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.

    Step 7- మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

    Step 8- ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పాన్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 9- ఆ తర్వాతి పేజీలో మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 10- మీ వివరాలన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

    Step 11- మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకు నుంచి మీకు కాల్ వస్తుంది.

    Step 12- బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి.

    Step 13- బ్యాంకులో కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది.

    Step 14- వెరిఫికేషన్ పూర్తైన 3 నుంచి 5 రోజుల్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.

    Pension Scheme: రిటైర్‌మెంట్ తర్వాత నెలకు రూ.1,78,000 పెన్షన్... ఎంత పొదుపు చేయాలో తెలుసా?

    అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన అర్హతలివే


    ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కొన్ని అర్హతలు తప్పనిసరి. అకౌంట్ ఓపెన్ చేసే వ్యక్తి భారతీయ పౌరులై ఉండాలి. వయస్సు 18 ఏళ్ల పైనే ఉండాలి. ఒకవేళ మైనర్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలంటే తల్లిదండ్రులు, లేదా సంరక్షకులు అకౌంట్ ఓపెన్ చేయాలి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సమర్పించాలి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి.

    ఆన్‌లైన్‌లో అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్కసారి అది కూడా కేవైసీ వెరిఫికేషన్ కోసం బ్యాంకుకు వెళ్తే చాలు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆన్‌లైన్‌లోనే చేయొచ్చు. మీ అకౌంట్‌ను జీరో బ్యాలెన్స్ సాలరీ అకౌంట్‌గా మార్చుకోవచ్చు. ఆన్‌లైన్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పాన్ కార్డు తప్పనిసరి. ప్రతీ నెలా స్టేట్‌మెంట్స్ ఇ-మెయిల్ ద్వారా స్టేట్‌మెంట్స్ లభిస్తాయి. పర్సనలైజ్డ్ డెబిట్ కార్డ్ లభిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published: