స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తమ ఖాతాదారులందరికీ హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. సైబర్ నేరగాళ్ల నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరిస్తూ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. భారతదేశంలో రెండుమూడేళ్లుగా ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక లాక్డౌన్ నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగాయి. ఆన్లైన్ లావాదేవీలు పెరిగినట్టుగానే మోసాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తోంది. మీరు ఎస్బీఐ కస్టమర్ అయినా, ఇతర బ్యాంకుల్లో మీకు ఖాతాలు ఉన్నా సైబర్ మోసగాళ్లకు టార్గెట్ కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకోండి.
Savings Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే రూ.66 లక్షలు రిటర్న్స్... వివరాలివే
Personal Loan: లోన్ ఈజీగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి
మీ వ్యక్తిగత వివరాలు అంటే మీ పేరు, పాన్ నెంబర్, కార్డు నెంబర్లు, పిన్, సీవీవీ, ఓటీపీ లాంటివి అడుగుతూ ఎవరైనా మీకు ఫోన్ చేశారా? ఎస్ఎంఎస్ టెక్స్ట్ట్ మెసేజ్ పంపారా? అయితే జాగ్రత్త. మీ బ్యాంకు స్టేట్మెంట్లో మీకు సంబంధం లేని లావాదేవీలు ఏవైనా కనిపిస్తున్నాయా? అయితే అప్రమత్తం కావాల్సిందే. మీరు ఇలాంటివి ఏవైనా గుర్తించినా, లేదా మీ కీలకమైన సమాచారాన్ని అపరిచితులకు చెప్పి మోసపోయినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in/ లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. బ్యాంకుకు కూడా కంప్లైంట్ చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:July 22, 2020, 16:01 IST