Home /News /business /

STATE BANK OF INDIA SBI ACCOUNT HOLDERS FOLLOW THESE STEPS TO LINK YOUR AADHAAR WITH BANK ACCOUNT SS

Aadhaar-SBI link: మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయలేదా? ఇలా చేయండి

Aadhaar-SBI link: మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయలేదా? ఇలా చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar-SBI link: మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయలేదా? ఇలా చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar-SBI link | మీరు ఇప్పటి వరకు మీ ఆధార్ నెంబర్‌ను ఎస్‌బీఐ అకౌంట్‌కు లింక్ చేయకపోతే 5 మార్గాలున్నాయి. ఎస్‌బీఐ కార్పొరేట్ వెబ్‌సైట్, ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ పోర్టల్, ఎస్‌బీఐ ఎనీవేర్ యాప్, ఎస్‌బీఐ ఏటీఎం, ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి మీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు.

ఇంకా చదవండి ...
    మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? అయితే మీరు మీ ఆధార్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం నిబంధనల ప్రకారం తప్పనిసరి. ప్రభుత్వ పథకాలకు చెందిన సబ్సిడీని పొందేందుకు బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ చేయాలని ప్రభుత్వం చాలాకాలంగా చెబుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ కస్టమర్లకు ఇదే విషయంపై అవగాహన కల్పిస్తోంది. మరి మీరు ఇప్పటి వరకు మీ ఆధార్ నెంబర్‌ను ఎస్‌బీఐ అకౌంట్‌కు లింక్ చేయకపోతే 5 మార్గాలున్నాయి. ఎస్‌బీఐ కార్పొరేట్ వెబ్‌సైట్, ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ పోర్టల్, ఎస్‌బీఐ ఎనీవేర్ యాప్, ఎస్‌బీఐ ఏటీఎం, ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి మీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు.

    1. SBI corporate website: ముందుగా www.sbi.co.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో 'Link your AADHAAR Number with your bank account' ఆప్షన్‌పైన క్లిక్ చేయండి. మీ వివరాలు ఎంటర్ చేసి రిక్వెస్ట్ సబ్మిట్ చేయండి. మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు సమాచారం అందుతుంది.

    2. SBI net banking portal: ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్ పోర్టల్ www.onlinesbi.com ఓపెన్ చేయండి. మీ వివరాలతో లాగిన్ కావాలి. ఆ తర్వాత 'My Accounts' ఆప్షన్‌లోకి వెళ్లిన తర్వాత 'Link your Aadhaar number' లింక్ పైన క్లిక్ చేయండి. మీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.

    3. SBI anywhere App: ఎస్‌బీఐ ఎనీవేర్ యాప్‌లో లాగిన్ చేసిన తర్వాత 'Requests' పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత 'Aadhaar' సెక్షన్‌లో 'Aadhaar linking' పైన క్లిక్ చేయాలి. మీ వివరాలతో పాటు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

    4. SBI ATM: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో మీ డెబిట్ కార్డుతో స్వైప్ చేయాలి. మీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత 'Service -- Registrations' క్లిక్ చేసి ఆధార్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేయాలి. మీ అకౌంట్ సరిచూసుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.

    5. SBI branch: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు వెళ్లి మీ అకౌంట్‌తో ఆధార్ లింకింగ్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్‌తో పాటు మీ ఆధార్ జిరాక్స్ కాపీ కూడా జత చేయాలి. వెరిఫికేషన్ తర్వాత మీ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అవుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు సమాచారం అందుతుంది.

    Gold Toilet: బంగారంతో టాయిలెట్... ధర రూ.9 కోట్లు... చూస్తే షాకే



    ఇవి కూడా చదవండి:

    Indian Railways: రైలు పట్టాలపై ప్రత్యక్షమైన యముడు... బెదిరిపోయిన ప్రయాణికులు

    Credit Card: మీ క్రెడిట్ కార్డుపై లిమిట్ తక్కువగా ఉంటే పెంచుకోండి ఇలా

    Card Lost: క్రెడిట్, డెబిట్ కార్డులు పోయాయా? వెంటనే ఇలా చేయండి
    First published:

    Tags: Aadhaar, Aadhaar card, AADHAR, Personal Finance, Sbi, State bank of india, UIDAI

    తదుపరి వార్తలు