హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Loan: ష్యూరిటీ లేకుండా రూ.5 లక్షల వరకు లోన్... ఎస్‌బీఐ సహా లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే

Bank Loan: ష్యూరిటీ లేకుండా రూ.5 లక్షల వరకు లోన్... ఎస్‌బీఐ సహా లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే

Bank Loan: ష్యూరిటీ లేకుండా రూ.5 లక్షల వరకు లోన్... ఎస్‌బీఐ సహా లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Loan: ష్యూరిటీ లేకుండా రూ.5 లక్షల వరకు లోన్... ఎస్‌బీఐ సహా లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Bank Loan | ఆర్థిక ఇబ్బందుల కారణంగా పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు ష్యూరిటీ లేకుండా రూ.5 లక్షల వరకు లోన్స్ ఇస్తున్నాయి.

  కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. దీంతో సామాన్యులకు ఆర్థిక కష్టాలు తప్పట్లేదు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటివారికి ఓ గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.5,00,000 వరకు పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయి. ష్యూరిటీ కూడా అవసరం లేదు. కోవిడ్ 19 సంబంధిత చికిత్సకు అయ్యే ఖర్చుల కోసమే బ్యాంకులు ఈ రుణాలు ఇస్తున్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI తీసుకున్న కోవిడ్-19 కీలక నిర్ణయంలో భాగంగా బ్యాంకులు ఈ రుణాలు ఇస్తున్నాయి. కనీసం రూ.25,000 నుంచి గరిష్టంగా రూ.5,00,000 వరకు రుణాలు తీసుకోవచ్చు. వెంటనే చెల్లించాల్సిన అసరం లేదు. ఐదేళ్ల గడువు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు. మొదటి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఈఎంఐ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రుణాలకు వడ్డీ కూడా తక్కువ. 6.85 శాతం నుంచి వడ్డీ మొదలవుతుంది.

  వేతనాలు పొందే ఉద్యోగులు, వ్యాపారాలు చేసేవారు, పెన్షనర్లు కూడా ఈ లోన్ తీసుకోవచ్చు. తమకు లేదా తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కోవిడ్-19 సంబంధిత చికిత్స కోసం ఈ రుణాలకు దరఖాస్తు చేయొచ్చు. అయితే కోవిడ్ 19 పాజిటీవ్ వచ్చినట్టు రిపోర్ట్ ఇవ్వడంతో పాటు కోవిడ్ 19 చికిత్స కోసం ఎలా ఖర్చు చేయబోతున్నారన్న వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నియమనిబంధనలన్నీ అంగీకరించిన వారికే రుణాలు వస్తాయి. గత 12 నెలలుగా సంబంధిత బ్యాంకులోని అకౌంట్‌లో సాలరీ క్రెడిట్ కావాలి. ఇప్పటికే ఆ బ్యాంకులో రీటైల్ లోన్ తీసుకున్నవారు కూడా మళ్లీ ఈ రుణాలకు దరఖాస్తు చేయొచ్చు. వేతనాలు పొందని వారు సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్‌గా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉండాలి. మరి ఏ బ్యాంకులు ఎంత వరకు రుణాలు ఇస్తున్నాయో తెలుసుకోండి.

  Udyogni Scheme: మహిళా వ్యాపారులకు గొప్ప అవకాశం... బిజినెస్ కోసం రూ.3,00,000 వరకు లోన్

  SBI Gold Loan: ఎస్‌బీఐలో గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటుపై డిస్కౌంట్

  State Bank of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.5 శాతం వడ్డీ రేటుకు రుణాలను ఇస్తున్నాయి. కనీసం రూ.25,000 నుంచి రూ.5,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. ఐదేళ్లలో రుణాలు తిరిగి చెల్లించాలి.

  Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB Sahyog RIN COVID పేరుతో రుణాలు అందిస్తోంది. వడ్డీ రేటు 8.5 శాతం. వేతనానికి 6 రెట్లు లేదా రూ.3,00,000 వరకు రుణం పొందొచ్చు.

  Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఆరు నెలలుగా తమ కస్టమర్‌గా ఉన్నవారికి ఈ రుణాలను ఇస్తోంది. గత మూడు నెలలుగా రెగ్యులర్ ఇన్‌స్టాల్‌మెంట్స్ చెల్లిస్తున్నవారు కూడా రుణాలకు దరఖాస్తు చేయొచ్చు.

  Gold Price Today: రికార్డు ధర నుంచి గోల్డ్ రేట్ పతనం... రూ.10,470 తగ్గిన బంగారం

  Gold Purity Check: బంగారు నగలు నకిలీవా? ఒరిజినలా? ఈ చిట్కాలతో మీ ఇంట్లోనే టెస్ట్ చేయండి

  Bank of India: బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ దగ్గర పర్సనల్ లోన్, హోమ్ లోన్ తీసుకున్నవారికి ఈ రుణాలను అందిస్తోంది. ఆరు నెలల మారటోరియం కూడా ఇస్తోంది. మూడేళ్లలో రుణాలు చెల్లించాలి. వడ్డీ రేటు 6.85 శాతం.

  Union Bank: యూనియన్ బ్యాంక్ 8.5 శాతానికి పర్సనల్ లోన్ ఇస్తోంది. ఐదేళ్ల లోపు రుణాలు తిరిగి చెల్లించాలి.

  Canara Bank: కెనెరా బ్యాంకు సురక్ష పర్సనల్ లోన్ పేరుతో రుణాలు ఇస్తోంది. రూ.25,000 నుంచి రూ.5,00,000 వరకు లోన్ పొందొచ్చు. ఆరు నెలల మారటోరియం ఉంటుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank, Bank account, Bank loan, Bank loans, Bank news, Bank of Baroda, Bank of India, Canara Bank, Government banks, Personal Finance, Personal Loan, Punjab National Bank, State bank of india, Union bank of india

  ఉత్తమ కథలు