SBI PPF Scheme: అధిక వడ్డీ కావాలా? ఎస్‌బీఐ పీపీఎఫ్ స్కీమ్ ట్రై చేయండి

State Bank of India Public Provident Fund Scheme | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీపీఎఫ్ స్కీమ్‌లో చేరడానికి ఎవరు అర్హులు? ఈ పథకంలో చేరాలంటే కనీసం ఎంత చెల్లించాలి? లభించే వడ్డీ ఎంత? పన్ను లాభాలు ఎలా ఉంటాయి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 14, 2019, 1:00 PM IST
SBI PPF Scheme: అధిక వడ్డీ కావాలా? ఎస్‌బీఐ పీపీఎఫ్ స్కీమ్ ట్రై చేయండి
SBI PPF Scheme: అధిక వడ్డీ కావాలా? ఎస్‌బీఐ పీపీఎఫ్ స్కీమ్ ట్రైచేయండి
news18-telugu
Updated: March 14, 2019, 1:00 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) స్కీమ్‌లో చేరితే మూడు లాభాలు. ఒకటి మీ భవిష్యత్తు, డబ్బు సురక్షితంగా ఉంటాయి. అధిక వడ్డీ లభించడం రెండో లాభం. మూడోది పన్ను మినహాయింపులు ఉండటం. మొట్టమొదటిసారిగా ఈ పథకాన్ని నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజేషన్ 1968లో ప్రారంభించింది. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీపీఎఫ్ స్కీమ్‌లో చేరడానికి ఎవరు అర్హులు? ఈ పథకంలో చేరాలంటే కనీసం ఎంత చెల్లించాలి? లభించే వడ్డీ ఎంత? పన్ను లాభాలు ఎలా ఉంటాయి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోండి.

Read this: SBI Alert: వాట్సప్ స్కామ్‌తో జాగ్రత్త... హెచ్చరిస్తున్న ఎస్‌బీఐ

State Bank of India Public Provident Fund Scheme, SBI PPF Scheme, SBI ppf account online, ppf account rules, ppf account balance, ppf calculator 2019, ppf withdrawal calculator, SBI PPF Scheme interest, ఎస్‌బీఐ పీపీఎఫ్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, పీపీఎఫ్ అకౌంట్ రూల్స్, పీపీఎఫ్ వడ్డీ
ప్రతీకాత్మక చిత్రం


ఎస్‌బీఐ పీపీఎఫ్ స్కీమ్ వివరాలు




అర్హత: ఎస్‌బీఐ పీపీఎఫ్ అకౌంట్ ఏ బ్రాంచ్‌లో అయినా ఓపెన్ చేయొచ్చు. స్వంతగా లేదా మైనర్ తరఫున అకౌంట్ తీసుకోవచ్చు.

డిపాజిట్: రూ.500 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.1,50,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేయడానికి వీల్లేదు. ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా ఏడాదిలో 12 వాయిదాల్లో డిపాజిట్ చేయొచ్చు.

స్కీమ్ కాల వ్యవధి: ఎస్‌బీఐ పీపీఎఫ్ స్కీమ్ కాలవ్యవధి 15 ఏళ్లు. ఆ తర్వాత ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు.

వడ్డీ: కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం వార్షిక వడ్డీ 8.7%.

Read this: PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా సరిదిద్దుకోవచ్చు

State Bank of India Public Provident Fund Scheme, SBI PPF Scheme, SBI ppf account online, ppf account rules, ppf account balance, ppf calculator 2019, ppf withdrawal calculator, SBI PPF Scheme interest, ఎస్‌బీఐ పీపీఎఫ్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, పీపీఎఫ్ అకౌంట్ రూల్స్, పీపీఎఫ్ వడ్డీ
ప్రతీకాత్మక చిత్రం


లోన్ లేదా విత్‌డ్రా: వయస్సు, అకౌంట్ బ్యాలెన్స్‌ని బట్టి లోన్ తీసుకోవచ్చు. లేదా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.

పన్ను లాభాలు: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 88 కింద పన్ను లాభాలు ఉంటాయి. డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్నుతో పాటు వెల్త్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.

నామినేషన్: మీ పేరు మీద పీపీఎఫ్ అకౌంట్ ఉంటే నామినీలను ఎంచుకోవచ్చు. ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో వివరించాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐ పీపీఎఫ్ స్కీమ్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్

ఇవి కూడా చదవండి:

IRCTC Tatkal Rules: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? రూల్స్, ఛార్జెస్ వివరాలు తెలుసుకోండి

JIO Prepaid Plans: రోజుకు 2GB హై స్పీడ్ డేటా... జియో ప్లాన్స్ ఇవే...

One Nation One Card: వన్ నేషన్ వన్ కార్డ్ వాడితే 10% క్యాష్‌బ్యాక్... కార్డు ఫీచర్లు ఇవే
First published: March 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...