హోమ్ /వార్తలు /బిజినెస్ /

Savings Accounts: చిన్న పిల్లల కోసం ఎస్‌బీఐ స్పెషల్ సేవింగ్స్ అకౌంట్లు.. ప్రయోజనాలివే..

Savings Accounts: చిన్న పిల్లల కోసం ఎస్‌బీఐ స్పెషల్ సేవింగ్స్ అకౌంట్లు.. ప్రయోజనాలివే..

SBI

SBI

Savings Accounts: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చిన్న పిల్లల కోసం రెండు సేవింగ్ అకౌంట్స్‌ పరిచయం చేసింది. వీటి ప్రయోజనాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చిన్న పిల్లల కోసం రెండు సేవింగ్ అకౌంట్స్‌ పరిచయం చేసింది. పెహ్లా కదమ్‌ (Pehla Kadam), పెహ్లీ ఉడాన్ (Pehli Udaan) పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ అకౌంట్స్‌.. డబ్బును ఆదా చేయడం, పొదుపు చేయడం వంటి ఫైనాన్షియల్ హ్యాబిట్స్‌ అలవర్చుకోవడంలో మైనర్ల (Minors)కు ఉపయోగపడతాయి. ఈ అకౌంట్స్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదు. జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్ ఓపెన్ చేసి గరిష్ఠంగా రూ.10 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. దేశంలో ఉన్న ఏ ఎస్‌బీఐ బ్రాంచ్‌కైనా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఇవి అందించే నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వల్ల మోడ్రన్ డే బ్యాంకింగ్ ఎలా వర్క్ అవుతుందో చిన్నపిల్లలకు పూర్తి అవగాహన వస్తుంది. ఇంకా ఎన్నో బెనిఫిట్స్‌ని ఇవి పిల్లలకు ఆఫర్ చేస్తున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

* ఎస్‌బీఐ పెహ్లీ ఉడాన్ అకౌంట్

ఎప్పుడూ ఒకేలా సంతకం చేయగల, 10 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్లు పెహ్లీ ఉడాన్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. అలా ఓపెన్ చేశాక చిన్నపిల్లలే ఈ అకౌంట్‌ని సొంతంగా మెయింటైన్ చేయవచ్చు. ఆ విధంగా ఎవరి సహాయం లేకుండా పూర్తి ఆర్థిక స్వేచ్ఛను ఈ అకౌంట్ ద్వారా చిన్న పిల్లలు పొందొచ్చు.

* పెహ్లీ ఉడాన్‌తో ప్రయోజనాలివే

- ఈ అకౌంట్ ద్వారా పిల్లల ఫొటో గల ఏటీఎం-కమ్-డెబిట్ కార్డు తీసుకోవచ్చు. ఈ డెబిట్ కార్డ్ రోజువారీ విత్‌డ్రాయల్ లిమిట్ రూ.5,000. ఈ పరిమితిలో క్యాష్ విత్‌డ్రాయల్స్‌, పాయింట్ ఆఫ్ సేల్స్ (POS) వద్ద ట్రాన్సాక్షన్స్ కూడా యాడ్ అవుతాయి. అయితే ఈ కార్డు కేవలం మైనర్ పేరు మీదే జారీ అవుతుంది.

- ఎస్‌బీఐ పెహ్లీ ఉడాన్ అకౌంట్ మైనర్ల పేరుతో పర్సనల్ చెక్‌బుక్ జారీ చేస్తుంది. ఈ చెక్‌బుక్‌లో 10 చెక్ లీఫ్‌లు ఉంటాయి.

- మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీతో పిల్లలు తమ ఖాతాలను వ్యూ చేయవచ్చు. అంతేకాదు, బిల్లు పేమెంట్స్, టాప్ అప్స్‌, ఇమీడియట్ పేమెంట్ సర్వీస్‌ల వంటివి చేసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ రోజువారీ ట్రాన్సాక్షన్ల లిమిట్ రూ.2,000గా ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను సైతం పరిమిత ట్రాన్సాక్షన్ లిమిట్‌తో వాడుకోవచ్చు.

* పెహ్లా కదమ్‌

ఎస్‌బీఐ పెహ్లా కదమ్‌ అకౌంట్‌ను ఏ వయసు చిన్న పిల్లలైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్‌ను తల్లిదండ్రులు/గార్డియన్‌తో కలిసి జాయింట్ అకౌంట్‌గా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలానే దీనిని తల్లిదండ్రులు/గార్డియన్‌లతో కలిపి మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే పేరెంట్/గార్డియన్‌ సోలోగా నిర్వహించవచ్చు.

* పెహ్లా కదమ్‌ ప్రయోజనాలివే

- ఈ అకౌంట్ ద్వారా పిల్లల ఫొటో ఉండేలా ఏటీఎం-కమ్-డెబిట్ కార్డు అందుకోవచ్చు. ఈ డెబిట్ కార్డ్ రోజువారీ విత్‌డ్రాయల్ లిమిట్ రూ.5,000. ఈ పరిమితిలో క్యాష్ విత్‌డ్రాయల్స్‌, వివిధ పాయింట్ ఆఫ్ సేల్స్ (POS) వద్ద ట్రాన్సాక్షన్స్ కూడా యాడ్ అవుతాయి. అయితే ఈ కార్డు కేవలం మైనర్, గార్డియన్ పేరు మీద జారీ అవుతుంది.

ఇది కూడా చదవండి : యూనియన్ మ్యూచువల్ ఫండ్ నుంచి రిటైర్మెంట్‌ స్కీమ్‌ లాంచ్‌.. ఇందులో ఇన్వెస్ట్‌ చేయవచ్చా?

- పెహ్లా కదమ్‌ ఖాతాదారులకు కూడా చెక్‌బుక్ జారీచేస్తుంది ఎస్‌బీఐ. అయితే చెక్‌బుక్ మైనర్ పేరుతో గార్డియన్‌కు జారీ అవుతుంది. ఈ అకౌంట్ హోల్డర్‌కి కూడా చెక్‌బుక్‌లో మొత్తంగా 10 చెక్ లీఫ్‌లు అందిస్తారు.

- మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీతో పిల్లలు తమ అకౌంట్స్ వ్యూ చేయవచ్చు. అంతేకాదు, బిల్లు పేమెంట్స్, ఇమీడియట్ పేమెంట్ సర్వీస్, టాప్ అప్స్‌ వంటివి చేసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ రోజువారీ ట్రాన్సాక్షన్ల లిమిట్ రూ.2,000గా ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను కూడా పరిమిత ట్రాన్సాక్షన్ లిమిట్‌తో వాడుకోవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు