సీనియర్ సిటిజన్లు రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని సుఖంగా గడపాలని భావిస్తారు. అందుకు ముందు నుంచే మనీ సేవ్ చేస్తారు. ఈ అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. ఎలాంటి మనీ (Money) సేవ్ చేసుకోని వృద్ధులకు సొంతిల్లు ఉంటే అదనపు ఆదాయ వనరులను పొందే అవకాశం ఉంది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రివర్స్ మార్ట్గేజ్ లోన్ ఫెసిలిటీ ద్వారా సొంత ఇల్లు ఉన్న సీనియర్ సిటిజన్లకు అదనపు ఆదాయ వనరును అందిస్తోంది.
తమను తాము పోషించుకోవడానికి తగిన ఆదాయ వనరులు లేని వృద్ధులకు రివర్స్ మార్టిగేజ్ లోన్ ఉపయోగపడుతుందని ఎస్బీఐ పేర్కొంది. రివర్స్ మార్ట్గేజ్ లోన్ కింద ఎస్బీఐ సీనియర్ సిటిజన్ల ఇంటిని తనఖా పెట్టుకుని లోన్ అందిస్తుంది. రుణగ్రహీతను తన జీవితకాలంలో రుణం తిరిగి చెల్లించమని బలవంతం చేయమని బ్యాంక్ తెలిపింది. అయితే రుణగ్రహీతకు రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉందని చెప్పింది. ఈ స్కీమ్ గురించి సీనియర్ సిటిజన్లు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు చూద్దాం.
ఎయిర్టెల్ సిమ్ వాడే వారికి షాక్.. రీచార్జ్ ధరలను భారీగా పెంచేసిన కంపెనీ!
రివర్స్ మార్ట్గేజ్ లోన్లను అందించే బ్యాంకులు సాధారణంగా ప్రతి 5 సంవత్సరాల తర్వాత ప్రాపర్టీ వాల్యుయేషన్‌ని నిర్వహిస్తాయి. పొందగలిగే నెలవారీ మొత్తం స్థిరంగా ఉండటంతో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావం పడదు. రివర్స్ మార్ట్గేజ్ లోన్ ఆమోదించేటప్పుడు బ్యాంకులు సాధారణంగా ఆస్తి మదింపుపై 15-20% మార్జిన్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. ఉదాహరణకు ఆస్తి విలువ రూ.50 లక్షలు అయితే, రివర్స్ మార్ట్గేజ్ లోన్ కింద రూ.40 లక్షలు మాత్రమే మంజూరు అవుతుంది. రుణ మొత్తంలో వడ్డీ భాగం కూడా ఉంటుంది. వడ్డీని తీసివేసి రుణాన్ని అందజేస్తారు.
పేటీఎం వాడే వారికి శుభవార్త.. ఇక ఫోన్‌పే, గూగుల్ పేకు డబ్బులు పంపొచ్చు!
రుణగ్రహీత మరణించిన తరువాత, బ్యాంకు ఆస్తిని విక్రయిస్తుంది. ఆస్తిని ఎక్కువ ధరకు విక్రయిస్తే అది రుణగ్రహీత చట్టబద్ధమైన వారసులకు బ్యాలెన్స్‌ని తిరిగి ఇస్తుంది. ప్రత్యామ్నాయంగా చట్టపరమైన వారసులు రుణాన్ని బ్యాంకుకు తిరిగి చెల్లించి, ఇంటిని తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు తమ లోన్‌ను పెనాల్టీలు లేకుండా ముందస్తుగా చెల్లించవచ్చు. రుణగ్రహీతలకు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక లేదా ఏకమొత్తం చెల్లింపు ఆప్షన్లు ఉంటాయి. రివర్స్ మార్ట్గేజ్ లోన్ సౌకర్యం ద్వారా కనీస మొత్తం రూ.3 లక్షలు, గరిష్టంగా రూ.కోటి అందుకోవచ్చు. రుణం తీసుకున్న వారి వయస్సును బట్టి లోన్ టెన్యూర్ 10 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది.
ఒంటరిగా ఉన్న రుణగ్రహీత విషయంలో, 60 సంవత్సరాల వయస్సు గల భారతీయులు రివర్స్ మార్ట్గేజ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దంపతులు ఇద్దరూ ఉంటే.. జీవిత భాగస్వామి వయస్సు 58 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. దీనిపై SBI లోన్ మొత్తంలో 0.50 శాతాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తుంది. ఇది కనిష్టంగా రూ.2000, గరిష్టంగా రూ.20,000 ఉండవచ్చు, పన్నులు వర్తిస్తాయి. లోన్ మంజూరు తర్వాత, రుణగ్రహీత రుణ ఒప్పందం, ఆస్తి ఇన్సూరెన్స్ ప్రీమియంకు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీని చెల్లించాలి. SBI రివర్స్ మార్ట్గేజ్ లోన్‌పై ప్రస్తుత వడ్డీ రేటు 10.95 శాతంగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Sbi, Senior citizens, State bank of india