స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్వయం సహాయక బృందాలకు (SHGs) పూచీకత్తు లేకుండా రుణాలను అందిస్తోంది. ఎస్‌హెచ్‌జీ సమూహ్ శక్తి క్యాంపైన్‌లో భాగంగా స్వయం సహాయక బృందాలకు రూ.10 లక్షల వరకు లోన్స్ ఇస్తోంది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకే రుణాలు అందిస్తోంది ఎస్‌బీఐ. భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ 2022 అక్టోబర్ 1న ఎస్‌హెచ్‌జీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఎస్‌హెచ్‌జీ-క్రెడిట్ లింకేజీ ప్రోగ్రామ్ 1992 లో ప్రారంభమైంది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలపమెంట్ (NABARD) ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ యాక్టీవ్‌గా పాల్గొంటోంది.
ఎస్‌బీఐ ఎస్‌హెచ్‌జీ సమూహ్ శక్తి ప్రోగ్రామ్‌లో భాగంగా అన్ని జిల్లాల్లోని మహిళా గ్రామీణ బృందాలు 7 శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు రుణాలు తీసుకోవచ్చు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు తీసుకునే వారికి ఒక ఏడాది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) వర్తిస్తుంది. ఇక రూ.5 లక్షల పైన రుణాలకు 9 శాతం వడ్డీ వర్తిస్తుంది. స్వయం సహాయక సంఘాలకు రూ.10.00 లక్షల పరిమితి వరకు ఎటువంటి పూచీకత్తు, మార్జిన్ లేకుండా లోన్స్ ఇస్తోంది ఎస్‌బీఐ . రుణాలు మంజూరు చేసేందుకు డిపాజిట్లు చేయాలని ఒత్తిడి చేయదు బ్యాంకు .
Aadhaar Card: మీ ఆధార్ కార్డులో ఈ వివరాలు చెక్ చేశారా? ఇలా చెక్ చేయండి
SBI is empowering Self-help Groups (SHGs) with excellent benefits on credit facilities. Learn more about it: https://t.co/uh5PSKRxIv#SBI #AmritMahotsav #CreditFacility #SelfHelpGroup #Finance #MeraSHGMeraBank pic.twitter.com/PQBIkZA4Pp
— State Bank of India (@TheOfficialSBI) January 15, 2023
ఇక అన్ని జిల్లాల్లోని మహిళా గ్రామీణ బృందాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య రుణాలు తీసుకుంటే క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ (CGFMU) కవరేజీ లభిస్తుంది. ఎస్‌బీఐ 2022 మార్చి 31 వరకు 8.71 స్వయం సహాయక బృందాలకు రూ.24,023 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఈ రుణాలు తీసుకున్నవారిలో 91 శాతం మహిళలే కావడం విశేషం. 2022 మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్న ఎస్‌హెచ్‌జీ రుణాల్లో 25.25 శాతం వాటా ఎస్‌బీఐది కావడం విశేషం.
స్వయం సహాయక బృందాలకు వారి మొత్తం క్రెడిట్ అవసరాలను తీర్చడానికి బ్యాంకు ఈ రుణాలను అందిస్తుంది. వీటిలో ఆదాయ పెంచే కార్యకలాపాలు, విద్య , గృహనిర్మాణం, పెళ్లి, రుణ మార్పిడి లాంటి సామాజిక అవసరాలు ఉన్నాయి. ఎస్‌బీఐ ఎస్‌హెచ్‌జీలకు టర్మ్ లోన్‌లు, క్యాష్ క్రెడిట్ లిమిట్స్ రెండింటినీ ఇస్తుండటం విశేషం. ఎస్‌బీఐ స్వయం సహాయక బృందాలకు మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గ్రామీణ, సెమీ అర్బన్ శాఖలలో పనిచేసే సిబ్బందికి అవగాహన కల్పిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business Loan, Personal Finance, Sbi loans