news18-telugu
Updated: August 17, 2020, 12:39 PM IST
SBI Loan: 59 నిమిషాల్లో ఎస్బీఐ పర్సనల్, బిజినెస్, హోమ్ లోన్... అప్లై చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా వైరస్ మహమ్మారి మీ ఆర్థిక సంక్షోభానికి కారణమా? ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడానికి పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు బిజినెస్ లోన్‌కు అప్లై చేయాలనుకుంటున్నారా? హోమ్ లోన్ తీసుకొని మీ సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్... ఇలా ఏ లోన్ అయినా కేవలం 59 నిమిషాల్లో మంజూరు చేస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. లోన్ అప్లికేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా https://www.sbiloansin59minutes.com/ పేరుతో వెబ్సైట్ ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా బిజినెస్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్, ముద్ర లోన్ అప్లికేషన్లను స్వీకరిస్తోంది. ఈ రుణాలను కేవలం 59 నిమిషాల్లో మంజూరు చేస్తోంది.
Gold Loan Vs Personal Loan: గోల్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్... ఈ రెండిట్లో ఏది బెస్ట్PF withdrawal: ఈ మూడు కరెక్ట్‌గా ఉంటేనే పీఎఫ్ విత్‌డ్రా సాధ్యం

ప్రతీకాత్మక చిత్రం
గతంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలను వేగంగా మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం https://www.psbloansin59minutes.com వెబ్‌సైట్‌ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేవలం 59 నిమిషాల్లో రూ.5 కోట్ల వరకు రుణాలను మంజూరు చేసేవి. కేవలం బిజినెస్ లోన్ల కోసం రూపొందించిన ఈ ప్లాట్పామ్ ద్వారా హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్స్ కూడా ఇస్తున్నాయి బ్యాంకులు. ఈ ప్లాట్‌ఫామ్‌కు అనుబంధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా https://www.sbiloansin59minutes.com/ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ద్వారా ఏ లోన్‌కైనా దరఖాస్తు చేయొచ్చు.
IRCTC SBI Credit Card: ఎస్బీఐ నుంచి ఐఆర్సీటీసీ క్రెడిట్ కార్డ్... జాయినింగ్ ఫీజు లేదు
Income Tax: రూ.1 లక్ష కన్నా ఎక్కువ నగలు కొంటున్నారా? ఐటీ నిఘా తప్పదు
ప్రతీకాత్మక చిత్రం
బిజినెస్ లోన్‌కు దరఖాస్తు చేయాలంటే ముందుగా జీఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత XML ఫార్మాట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అప్లోడ్ చేయాలి. గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ను పీడీఎఫ్ పార్మాట్లో అప్లోడ్ చేయాలి. డైరెక్టర్ లేదా ఓనర్ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. వీటిని పరిశీలించిన తర్వాత 59 నిమిషాల్లో ఇన్ ప్రిన్సిపల్ లోన్‌ను మంజూరు చేస్తుంది బ్యాంకు. అంటే మీ వివరాల ఆధారంగా మీకు ఎంత వరకు లోన్ ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధంగా ఉందో తెలుపుతుంది. లోన్ అప్రూవల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఇమెయిల్ ఐడీకి కూడా ఈ లెటర్ వస్తుంది. ఆ తర్వాత బ్యాంకులు లోన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాయి.
ఇక పర్సనల్, హోమ్, ఆటో లోన్ తీసుకోవాలంటే ముందుగా XML ఫార్మాట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, పీడీఎఫ్ పార్మాట్లో గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలి. మీ వ్యక్తిగత వివరాలు, ఉద్యోగ వివరాలు ఎంటర్ చేయాలి. లోన్ ఎందుకోసం తీసుకోవాలనుకుంటున్నారో వివరించాలి. 59 నిమిషాల్లో ఇన్ ప్రిన్సిపల్ లోన్‌ను మంజూరు చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బిజినెస్ లోన్ రూ.1 లక్ష నుంచి రూ.5 కోట్ల వరకు, ముద్ర లోన్ రూ.10,000 నుంచి రూ.10 లక్షల వరకు, పర్సనల్ లోన్ రూ.20 లక్షల వరకు, హోమ్ లోన్ రూ.10 కోట్ల వరకు, ఆటో లోన్ రూ.1 కోటి వరకు తీసుకోవచ్చు.
Published by:
Santhosh Kumar S
First published:
August 17, 2020, 12:39 PM IST