స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్తగా ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ లాంఛ్ చేసింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), ఇతర పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ కన్నా ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఎస్‌బీఐ సర్వోత్తమ్ (SBI Sarvottam) పేరుతో ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఇది టర్మ్ డిపాజిట్ స్కీమ్. ఈ స్కీమ్‌లో సాధారణ ప్రజలకు రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఒకవేళ ఒక ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్షన్ ఎంచుకుంటే సాధారణ ప్రజలకు 7.1 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది.
రూ.15 లక్షల నుంచి రూ.2 కోట్ల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్లకు ఒక ఏడాదికి 7.82 శాతం, రెండేళ్ల డిపాజిట్‌కు 8.14 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య బల్క్ డిపాజిట్స్ చేస్తే ఒక ఏడాదికి 7.77 శాతం, రెండేళ్లకు 7.61 శాతం వడ్డీ లభిస్తుంది. పోస్ట్ ఆఫీసులో లభించే ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు, ఇతర స్కీమ్స్ కన్నా ఎస్‌బీఐ సర్వోత్తమ్ వడ్డీ రేట్లు ఎక్కువ. పోస్ట్ ఆఫీసుల్లో లభించే పథకాలకు వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
CIBIL Score: గూగుల్ పే యాప్ ఉందా? సింపుల్‌గా సిబిల్ స్కోర్ చెక్ చేయండిలా
ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లకు 7.2 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకు మాత్రమే పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ పొదుపు చేయాలనుకుంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం మంచిది. కానీ పన్ను ఆదా చేయలనుకుంటే పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయాలి.
పోస్ట్ ఆఫీసులో 5 ఏళ్ల టైమ్ డిపాజిట్‌కు 7 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది. ఒక ఏడాది డిపాజిట్‌కు 6.6 శాతం, రెండేళ్ల డిపాజిట్‌కు 6.8 శాతం వడ్డీ లభిస్తుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ డిపాజిట్లకు 7 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతీ ఏటా చక్రవడ్డీ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌లో ఐదేళ్లు ఇన్వెస్ట్ చేసి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
Maruti Car: కేవలం రూ.5,000 ఈఎంఐతో ఈ మారుతీ కార్‌ను ఇంటికి తీసుకెళ్లండి
కిసాన్ వికాస్ పత్ర డిపాజిట్లకు ప్రస్తుతం 7.2 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతీ ఏటా చక్రవడ్డీ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటే 120 నెలల్లో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fixed deposits, Personal Finance, Sbi, Sbi deposits, State bank of india