Home /News /business /

STATE BANK OF INDIA OFFERS FREE DOOR STEP BANKING SERVICES 3 TIMES IN A MONTH FOR DIFFERENTLY ABLED CUSTOMERS KNOW HOW TO AVAIL SS

SBI Free Service: ఇంటి దగ్గరే బ్యాంకింగ్ సేవలు... వారికి ఉచితంగా ఎస్‌బీఐ సర్వీస్

SBI Free Service: ఇంటి దగ్గరే బ్యాంకింగ్ సేవలు... వారికి ఉచితంగా ఎస్‌బీఐ సర్వీస్
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Free Service: ఇంటి దగ్గరే బ్యాంకింగ్ సేవలు... వారికి ఉచితంగా ఎస్‌బీఐ సర్వీస్ (ప్రతీకాత్మక చిత్రం)

SBI Free Service | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు శుభవార్త. ఎస్‌బీఐ కొంతకాలంగా అందిస్తున్న డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసుల్ని దివ్యాంగులకు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది.

కరోనా వైరస్ మహమ్మారి సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్నవారు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ (Doorstep Banking Services) ఉపయోగించుకోవచ్చు. కేవైసీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసినవారికే ఈ సేవలు లభిస్తాయి. బ్యాంక్ బ్రాంచ్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న సింగిల్ అకౌంట్, జాయింట్ అకౌంట్ హోల్డర్స్ ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ విషయంలో దివ్యాంగులకు ఎస్‌బీఐ ఉచితంగా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల్ని ప్రకటించింది. దివ్యాంగులు నెలలో మూడు సార్లు ఉచితంగా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల్ని పొందొచ్చు.

ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా లభించే సేవలివే


ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా పలు రకాల సేవలు లభిస్తాయి. పికప్ సర్వీసెస్, డెలివరీ సర్వీసెస్, ఇతర సేవల్ని పొందొచ్చు. కస్టమర్లు క్యాష్ పికప్, క్యాష్ డెలివరీ, చెక్ పికప్, చెక్ రిక్విజిషన్ స్లిప్ పికప్, ఫామ్ 15హెచ్ పికప్, డెలివరీ ఆఫ్ డ్రాఫ్ట్స్, డెలివరీ ఆఫ్ టర్మ్ డిపాజిట్ అడ్వైజ్, లైఫ్ సర్టిఫికెట్ పికప్, కేవైసీ డాక్యుమెంట్స్ పికప్ లాంటి సేవల్ని పొందొచ్చు. కస్టమర్లు 1800 1037 188 లేదా 1800 1213 721 నెంబర్లకు కాల్ చేసి ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల కోసం రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.

IRCTC Luggage Rules: భారీ లగేజీతో రైలు ఎక్కుతున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి


కస్టమర్లకు హోమ్ బ్రాంచ్ ద్వారానే డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు లభిస్తాయి. అది కూడా బ్యాంక్ బ్రాంచ్‌కు ఐదు కిలోమీటర్ల పరిధి వరకు ఈ సేవలు పొందొచ్చు. ఒక రోజులో ఒక ట్రాన్సాక్షన్ ద్వారా రూ.20,000 వరకే క్యాష్ విత్‌డ్రాయల్ లేదా క్యాష్ డిపాజిట్ చేయొచ్చు. చెక్ లేదా పాస్‌బుక్ ద్వారానే విత్‌డ్రాయల్ చేయాలి. డెలివరీ టీ+1 వర్కింగ్ డే పద్ధతిలో జరుగుతాయి. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు రూ.60 + జీఎస్‌టీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు రూ.100 + జీఎస్‌టీ చెల్లించాలి. అయితే దివ్యాంగులకు నెలలో మూడు సార్లు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు ఉచితం.

Aadhaar Mandatory: అలర్ట్... ప్రభుత్వ పథకాలకు, సబ్సిడీలకు ఇక ఆధార్ తప్పనిసరి


ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల్ని పొందండి ఇలా


Step 1- కస్టమర్లు ముందుగా యోనో ఎస్‌బీఐ యాప్ డౌన్‌లోడ్ చేయాలి.

Step 2- తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. ముందే రిజిస్ట్రేషన్ చేసినవాళ్లు నేరుగా లాగిన్ చేయాలి.

Step 3- ఆ తర్వాత సర్వీసెస్ రిక్వెస్ట్ మెనూలోకి వెళ్లాలి.

Step 4- Doorstep Banking Service ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 5- ఎలాంటి సర్వీస్ కావాలో సెలెక్ట్ చేసి సర్వీస్ రిక్వెస్ట్ ప్లేస్ చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Banking, Personal Finance, Sbi, State bank of india

తదుపరి వార్తలు