హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Gold Loan: ఎస్‌బీఐలో గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటుపై డిస్కౌంట్

SBI Gold Loan: ఎస్‌బీఐలో గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటుపై డిస్కౌంట్

ఇక కోల్ కతాలో 22 క్యారట్ల తులం బంగారం ధర 47 వేల 150 రూపాయలు ఉండగా.. 24 క్యారట్ల బంగారం ధర 49 వేల850 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారట్ల బంగారం ధర 45 వేల 100 రూపయాలు కాగా.. 24 క్యారట్ల బంగారం ధర49 వేల 200 రూపాయలుగా ఉంది.

ఇక కోల్ కతాలో 22 క్యారట్ల తులం బంగారం ధర 47 వేల 150 రూపాయలు ఉండగా.. 24 క్యారట్ల బంగారం ధర 49 వేల850 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారట్ల బంగారం ధర 45 వేల 100 రూపయాలు కాగా.. 24 క్యారట్ల బంగారం ధర49 వేల 200 రూపాయలుగా ఉంది.

SBI Gold Loan | గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునేవారికి ఎస్‌బీఐ వడ్డీ రేటుపై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

  కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు, వ్యాపారులు, అన్ని వర్గాలవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. దీంతో గోల్డ్ లోన్ తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. గోల్డ్ లోన్ తీసుకునేవారికి బ్యాంకులు లాభదాయకమైన ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. గోల్డ్ లోన్ వడ్డీ రేట్లపై డిస్కౌంట్ ప్రకటిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI గోల్డ్ లోన్‌ వడ్డీ రేటుపై డిస్కౌంట్ ప్రకటించింది. సాధారణంగా బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 7 శాతం నుంచి 29 శాతం మధ్య ఉంటాయి. ఎస్‌బీఐలో గోల్డ్ లోన్‌పై ప్రస్తుతం 7.50 శాతం వడ్డీ రేటు ఉంది.

  యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా చాలా సింపుల్‌గా గోల్డ్ లోన్‌కు దరఖాస్తు చేయొచ్చు. పేపర్ వర్క్ చాలా తక్కువ. ప్రాసెసింగ్ సమయం కూడా తక్కువే. యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా అప్లై చేసిన తర్వాత బ్రాంచ్‌లో ఎక్కువ సమయం ఉండాల్సిన అవసరం లేదు. యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా గోల్డ్ లోన్‌కు దరఖాస్తు చేస్తే 0.75 శాతం తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్ 2021 సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ ఉంది. కేవలం 4 స్టెప్స్‌లో గోల్డ్ లోన్‌కు అప్లై చేయొచ్చు. మరి యోనో ఎస్‌బీఐ వెబ్‌సైట్ లేదా యాప్‌లో పసిడి రుణాలకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

  Gold Price Today: రికార్డు ధర నుంచి గోల్డ్ రేట్ పతనం... రూ.10,470 తగ్గిన బంగారం

  Gold Purity Check: బంగారు నగలు నకిలీవా? ఒరిజినలా? ఈ చిట్కాలతో మీ ఇంట్లోనే టెస్ట్ చేయండి

  SBI Gold Loan: యోనో ఎస్‌బీఐ ద్వారా గోల్డ్ లోన్‌కు దరఖాస్తు చేయండి ఇలా


  ముందుగా యోనో ఎస్‌బీఐ వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేయాలి.

  అకౌంట్ వివరాలతో లాగిన్ కావాలి.

  హోమ్ పేజీలో త్రీ లైన్స్ పైన క్లిక్ చేయాలి.

  Loans పైన క్లిక్ చేయాలి.

  ఆ తర్వాత Gold Loan సెలెక్ట్ చేయాలి.

  Apply Now పైన క్లిక్ యాలి.

  ఆ తర్వాత నగల వివరాలను ఎంటర్ చేయాలి.

  నగ టైప్, బరువు, క్యారట లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.

  వృత్తి, ఆదాయం, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

  ఆ తర్వాత బ్రాంచ్‌కు వెళ్లి మీ నగలను ఇవ్వాల్సి ఉంటుంది.

  రెండు ఫోటోలు, కేవైసీ డాక్యుమెంట్స్ తప్పనిసరి.

  డాక్యుమెంట్స్ పైన సంతకం చేసి ఇచ్చిన తర్వాత లోన్ అప్రూవ్ అవుతుంది.

  Business Idea: లక్షల్లో ఆదాయం వచ్చే వ్యాపారం... రతన్ టాటా పెట్టుబడి పెట్టిన కంపెనీ ఫ్రాంఛైజ్ తీసుకోండిలా

  Bank Account: మీకు ఒకే బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్త

  ఎస్‌బీఐలో గోల్డ్ లోన్‌కు ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు. వయస్సు 18 ఏళ్ల పైనే ఉండాలి. ఆదాయానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలి. పెన్షనర్లకు ఇన్‌కమ్ ప్రూఫ్ అవసరం లేదు. కనీసం రూ.20,000 నుంచి రూ.50,00,000 వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. 36 నెలల్లోపు రుణాలు తిరిగి చెల్లించొచ్చు. బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ఎంచుకుంటే 12 నెలల్లో చెల్లించాలి. ఫోర్ క్లోజర్, ప్రీ-పేమెంట్ ఛార్జీలు ఉండవు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank loan, Bank loans, BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold loans, Gold ornmanets, Gold price, Gold price down, Gold Prices, Gold rate, Gold rate hyderabad, Gold rates, Gold shops, Personal Finance, Sbi, State bank of india, Yono, Yono app

  ఉత్తమ కథలు