• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • STATE BANK OF INDIA OFFERS 80 BASIS POINTS MORE INTEREST ON SBI WECARE DEPOSIT SCHEME FOR SENIOR CITIZENS THIS SCHEME ENDS ON 31ST MARCH 2021 SS

SBI Scheme: ఎస్‌బీఐలో ఈ స్కీమ్ మార్చి 31 వరకే... లాభాలు ఇవే

SBI Scheme: ఎస్‌బీఐలో ఈ స్కీమ్ మార్చి 31 వరకే... లాభాలు ఇవే

SBI Scheme: ఎస్‌బీఐలో ఈ స్కీమ్ మార్చి 31 వరకే... లాభాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

SBI Wecare Deposit Scheme | ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడానికి మరో రెండు నెలలు మాత్రమే గడువుంది. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    బ్యాంకులో డబ్బులు దాచుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వృద్ధుల కోసం ప్రత్యేకంగా 'ఎస్‌బీఐ వీకేర్' పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ స్కీమ్ గడువు 2020 డిసెంబర్ 31న ముగిసింది. కానీ డబ్బులు దాచుకోవాలనుకునేవారికి అవకాశం ఇచ్చేందుకు ఈ స్కీమ్ గడువును 2021 మార్చి 31 వరకు పొడిగించింది ఎస్‌బీఐ. కాబట్టి 'ఎస్‌బీఐ వీకేర్' ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మరో రెండు నెలలు మాత్రమే అవకాశం ఉంది. సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్లతో పోలిస్తే 'ఎస్‌బీఐ వీకేర్' ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా వృద్ధులు 0.80 శాతం వడ్డీ అధికంగా పొందొచ్చు. మామూలుగా అయితే సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కన్నా సీనియర్ సిటిజన్లకు అరశాతం అంటే 0.50 శాతం వడ్డీని అధికంగా ఇస్తుంటాయి. 'ఎస్‌బీఐ వీకేర్' ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా 0.30 శాతం అధికంగా వడ్డీ పొందొచ్చు.

    Gold: మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారాన్ని కొనండి ఇలా

    Ration Card: రేషన్ తీసుకుంటున్నారా? రేపటి నుంచి కొత్త రూల్స్... తెలుసుకోండి

    SBI Wecare Deposit: ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్ స్కీమ్ వివరాలు ఇవే...


    'ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్‌ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. వయస్సు 60 ఏళ్ల పైనే ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరూ సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. నామినేషన్ సదుపాయం కూడా ఉంది. ఇందులో కనీసం 5 ఏళ్లు డిపాజిట్ చేయాలి. ఇందులో కనీసం రూ.1,000 డిపాజిట్ చేయొచ్చు. గరిష్టంగా రూ.15,00,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. ఐదేళ్ల గడువు పూర్తైన తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. వడ్డీపై ఆదాయపు పన్ను మినహాయింపులు ఏవీ ఉండవన్న సంగతి గుర్తుంచుకోవాలి.ఒకవేళ అంతకన్నా ముందే డబ్బులు డ్రా చేస్తే 0.30 శాతం వడ్డీ తక్కువగా వస్తుంది. అంతే సాధారణంగా సీనియర్ సిటిజన్లకు ఉండే వడ్డీ రేట్లే వర్తిస్తాయి. ప్రస్తుతం ఎస్‌బీఐ ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 5.4 శాతం వడ్డీ ఇస్తోంది. 'ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే 6.2 శాతం వడ్డీ పొందొచ్చు. ఒకవేళ ఐదేళ్ల కన్నా ముందే డబ్బులు డ్రా చేస్తే 5.9 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది.

    Bank Savings Account: ఈ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఎక్కువ లాభం

    Sukanya Samriddhi Yojana: ఎస్‌బీఐలో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయండి ఇలా

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తరచూ వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. కాబట్టి వడ్డీ రేట్లను చెక్ చేస్తూ ఉండాలి. ఇక వడ్డీ ప్రతీ మూడు నెలలకోసారి అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఒకవేళ వడ్డీ తీసుకోకపోయినా ఆ వడ్డీపై మళ్లీ వడ్డీ రాదు.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు