స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్తగా హోమ్ లోన్ తీసుకునే కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. వడ్డీ రేటుపై ఏకంగా 45 బేసిస్ పాయింట్స్ తగ్గింపు ప్రకటించింది. ప్రస్తుతం ఎస్‌బీఐలో హోమ్ లోన్ వడ్డీ రేటు 9.15 శాతంగా ఉంటే, ఆఫర్‌లో 8.70 శాతం వడ్డీ మాత్రమే వర్తిస్తుంది. క్రెడిట్ స్కోర్ 750 పాయింట్స్ కన్నా ఎక్కువ ఉన్నవారు ఈ ఆఫర్ పొందొచ్చు. కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారికి మాత్రమే కాదు, ఇప్పటికే ఇతర బ్యాంకుల్లో గృహ రుణాలు తీసుకున్నవారు ఎస్‌బీఐకి మారాలనుకుంటే వారికి వడ్డీ రేటులో అదనంగా 20 బేసిస్ పాయింట్స్ తగ్గింపు లభిస్తుంది. ఈ లెక్కన వారికి 8.50 శాతం వడ్డీ మాత్రమే వర్తిస్తుంది. అసలు వడ్డీ రేటు కన్నా ఇది 65 బేసిస్ పాయింట్స్ తక్కువ.
హోమ్ లోన్లపై ఎస్‌బీఐ అందిస్తున్న ఆఫర్ జూన్ 30 వరకే వర్తిస్తుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు భారీగా పెంచడంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. గత ఏడాదిలో ఆర్‌బీఐ పలుమార్లు రెపో రేట్ పెంచింది. దీంతో ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్నవారికి, కొత్తగా రుణాలు తీసుకునేవారికి వడ్డీ రేట్లు భారంగా మారాయి.
Private Employees: ప్రైవేట్ ఉద్యోగులకు అలర్ట్... రూ.25 లక్షల వరకు బెనిఫిట్
మనీకంట్రోల్ కథనంలోని ఉదాహరణ ప్రకారం 42 ఏళ్లున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి 2022 ఏప్రిల్‌లో ఓ ప్రభుత్వ బ్యాంకులో 15 ఏళ్ల గడువుతో, 6.75 శాతం వడ్డీ రేటుతో రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. గతేడాది మే నుంచి ఆర్‌బీఐ పలుమార్లు రెపో రేట్ పెంచింది. దీంతో ఆయనకు వడ్డీ రేటు భారమైంది.
వడ్డీ రేటు పెరిగినప్పుడు హోమ్ లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ పెరుగుతుంది లేదా టెన్యూర్ పెరుగుతుంది. పైన చెప్పిన ఉదాహరణ ప్రకారం ఆర్‌బీఐ పెంచిన రెపో రేట్‌తో ఆయన టెన్యూర్ ఏకంగా 87 నెలలు పెరిగింది. అంటే అదనంగా మరో 87 నెలలు ఈఎంఐ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆయన రిటైర్మెంట్ వయస్సు దాటిన తర్వాత ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అలా కాదని ఈఎంఐ పెంచుకోవాలనుకుంటే అందరికీ ఈఎంఐ పెంచుకునేంత సేవింగ్స్ ఉండకపోవచ్చు.
Bank Account: బీ రెడీ... బ్యాంకులు పిలుస్తాయి... డబ్బులు ఇస్తాయి... జూన్ 1 నుంచి
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి రీఫైనాన్సింగ్ మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే 8.5 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలు లభిస్తాయి. ఎస్‌బీఐ మాత్రమే కాదు, ఇతర బ్యాంకులు కూడా మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఆఫర్ చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, Home loan, Housing Loans, Personal Finance, Sbi, State bank of india