వ్యాపారాలు చేయాలనుకునేవారికి బ్యాంకులు వేర్వేరు స్కీమ్స్ ద్వారా బిజినెస్ లోన్స్ (Business Loans) ఇస్తుంటాయి. చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా వ్యాపారులు రూ.10 లక్షల వరకు వ్యాపార రుణాలు పొందొచ్చు. కమర్షియల్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటీవ్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్సింగ్ సంస్థలు వ్యాపారులకు ఈ పథకం కింద రుణాలు ఇస్తుంటాయి. ముద్ర స్కీమ్‌లో శిశు, కిషోర్, తరుణ్ పేరుతో వేర్వేరు రకాల లోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద వ్యాపారులకు బిజినెస్ లోన్స్ ఇస్తోంది. ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్నవారు లేదా కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకునేవారు ఈ లోన్ తీసుకోవచ్చు. తయారీ రంగం, సేవల రంగంలో ఉన్నవారికి ఈ రుణాలు లభిస్తాయి. గరిష్టంగా రూ.10 లక్షల వరకు బిజినెస్ లోన్ తీసుకోవచ్చు. రూ.50,000 వరకు రుణాలను శిశు కేటగిరీలో, రూ.50,001 నుంచి రూ.5,00,000 వరకు రుణాలను కిషోర్ కేటగిరీలో, రూ.5,00,001 నుంచి రూ.10,00,000 వరకు రుణాలను తరుణ్ కేటగిరీలో ఇస్తారు.
Top-Up Policy: రూ.7,000 లోపు ప్రీమియంతో రూ.95 లక్షల కవరేజీ... వివరాలివే
SBI has always played an important role in the progress of the nation by helping entrepreneurs realise their dreams. For details of PMMY, visit this link - https://t.co/ncjUMrsVnm#SBI #AmritMahotsav #PMMY #AzadiKaAmritMahotsav #BankerToEveryIndian pic.twitter.com/6OI45uM2JS
— State Bank of India (@TheOfficialSBI) November 1, 2022
వ్యాపారాలు ప్రారంభించేవారు బ్యాంకు నుంచి తీసుకునే రుణం కాకుండా సొంతగా కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రూ.50,000 వరకు తీసుకునే శిశు రుణాలకు ఇది వర్తించదు. రూ.50,001 నుంచి రూ.10,00,000 వరకు రుణాలు తీసుకుంటే 10 శాతం మార్జిన్ ఉండాలి. అంటే 10 శాతం పెట్టుబడి సొంతగా పెట్టాలి. వడ్డీ రేట్ల విషయానికి వస్తే ఎంసీఎల్ఆర్కు లింక్ అయి ఉంటుంది.
ముద్ర లోన్ తీసుకున్న వ్యాపారులు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు రుణాలు చెల్లించాలి. 6 నెలల వరకు మారటోరియం ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. శిశు, కిషోర్ రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. తరుణ్ రుణాలకు లోన్ మొత్తంలో 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
Withdraw PF Amount Online: మీ పీఎఫ్ డబ్బుల్ని ఆన్లైన్లో ఈజీగా డ్రా చేయండి ఇలా
చిరు వ్యాపారులు, వర్తకులు, షాప్ కీపర్స్ ముద్ర లోన్ తీసుకోవచ్చు. ఆటో రిక్షా, స్మాల్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ కొనడానికి కూడా ముద్ర లోన్ తీసుకోవచ్చు. వాణిజ్య అవసరాలకు తీసుకునే టూవీలర్లకు కూడా ముద్ర లోన్లు వర్తిస్తాయి. బ్యూటీ పార్లర్స్, జిమ్, బొటిక్, టైలర్ షాప్, డ్రై క్లీనింగ్, మోటార్ సైకిల్ రిపేర్ షాప్, ఇంటర్నెట్ సెంటర్, జిరాక్స్ సెంటర్, కొరియర్ ఏజెంట్లు, క్యాంటీన్ సర్వీసెస్, బిస్కిట్ తయారీ, హ్యాండ్లూమ్, పవర్లూమ్ కూడా ముద్ర రుణాలు తీసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, Business Loan, Mudra loan, Personal Finance, Sbi loans