SBI Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఎస్‌బీఐలో IMPS NEFT వివరాలు ఇవే...

State Bank Of India Money Transfer | ఐఎంపీఎస్ ద్వారా మీరు గరిష్టంగా రూ.2 లక్షల వరకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. రాత్రి 10.45 నుంచి 11.45 మధ్య ఐఎంపీఎస్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ కావు. మీరు ఒకవేళ ఆ సమయంలో మనీ ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత అకౌంట్‌లో జమ అవుతాయి.

news18-telugu
Updated: March 12, 2019, 11:17 AM IST
SBI Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఎస్‌బీఐలో IMPS NEFT వివరాలు ఇవే...
SBI Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఎస్‌బీఐలో IMPS NEFT వివరాలు ఇవే...
news18-telugu
Updated: March 12, 2019, 11:17 AM IST
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉందా? ఎస్‌బీఐ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? మరి మీకు ఐఎంపీఎస్, నెఫ్ట్ ఛార్జీలు తెలుసా? ఐఎంపీఎస్... ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ ద్వారా మీరు ఏ క్షణమైనా వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మొబైల్ యాప్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల ద్వారా నిమిషాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇక నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సెటిల్మెంట్ పద్ధతిన జరుగుతాయి. బ్యాంకు పనివేళల్ని బట్టి మనీ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐఎంపీఎస్, నెఫ్ట్ సేవల గురించి తెలుసుకోండి.

Read this: Railway Jobs: పది పాసైతే చాలు... రైల్వేలో 1,00,000 ఉద్యోగాలు... మార్చి 12 నుంచి రిజిస్ట్రేషన్

SBI IMPS- ఐఎంపీఎస్



ఐఎంపీఎస్ ద్వారా మీరు గరిష్టంగా రూ.2 లక్షల వరకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. రాత్రి 10.45 నుంచి 11.45 మధ్య ఐఎంపీఎస్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ కావు. మీరు ఒకవేళ ఆ సమయంలో మనీ ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత అకౌంట్‌లో జమ అవుతాయి. ఐఎంపీఎస్ సేవలకు ఎలాంటి సెలవులు వర్తించవు.



ఎస్‌బీఐలో ఐఎంపీఎస్ ఛార్జీలు ఇవే...
రూ.1,000 వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు
రూ.1001 నుంచి రూ.10,000 వరకు రూ.1+జీఎస్టీ
Loading...
రూ.10,001 నుంచి రూ. 1,00,000 వరకు రూ.2+జీఎస్టీ
రూ.1,00,001 నుంచి రూ.2,00,000 వరకు రూ.3 + జీఎస్టీ

Read this: SBI Minor Account: ఎస్‌బీఐలో పిల్లల కోసం రెండు అకౌంట్లు... లాభాలు ఇవే

SBI money transfer, SBI online banking, SBI mobile banking, sbi neft charges, how to fill sbi neft form, what is neft, sbi neft transfer, sbi imps charges, what is imps, sbi imps transfer, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ ట్రాన్స్‌ఫర్, ఎస్‌బీఐ మనీ ట్రాన్స్‌ఫర్, ఎస్‌బీఐ ఐఎంపీఎస్, ఎస్‌బీఐ నెఫ్ట్, ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్
ప్రతీకాత్మక చిత్రం

SBI NEFT- నెఫ్ట్


నెఫ్ట్ సేవలు బ్యాచ్‌ల వారీగా కొనసాగుతుంటాయి. శనివారాలతో కలిపి అన్ని పనిదినాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మొత్తం 23 సెటిల్మెంట్స్ జరుగుతాయి. మీరు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల లోపు నెఫ్ట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే అదే రోజు డబ్బులు జమ అవుతాయి. సాయంత్రం 6.30 గంటల నుంచి 7 గంటల మధ్య నెఫ్ట్‌లో మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే అదే రోజు లేదా మరుసటి రోజు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఎస్‌బీఐ నెఫ్ట్ ద్వారా గరిష్టంగా రూ.10 లక్షల వరకు డబ్బులు పంపొచ్చు.

ఎస్‌బీఐలో నెఫ్ట్ ఛార్జీలు ఇవే...
రూ.10,000 వరకు బ్రాంచ్‌లో రూ.2.50, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు రూ.2
రూ.10,000 నుంచి రూ.1 లక్ష వరకు బ్రాంచ్‌లో రూ.5, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు రూ.4
రూ.1 లక్ష నుంచి రూ.2లక్షల వరకు బ్రాంచ్‌లో రూ.15, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు రూ.12
రూ.2 లక్షల కన్నా ఎక్కువ అయితే బ్రాంచ్‌లో రూ.25, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు రూ.20

Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...

ఇవి కూడా చదవండి:

Voter Helpline App: ఓటర్ హెల్ప్‌లైన్ యాప్... ఎలా వాడాలో తెలుసుకోండి

Lok Sabha Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేదా? 3 నిమిషాల్లో తెలుసుకోండి

LIC AABY: ఎల్ఐసీ ఆమ్ ఆద్మీ బీమా యోజన... ఈ స్కీమ్‌తో మీకెంత లాభం?
First published: March 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...