Home /News /business /

STATE BANK OF INDIA LAUNCHES UTSAV DEPOSIT FIXED DEPOSIT SCHEME WITH HIGHER INTEREST RATE KNOW SCHEME DETAILS SS

Independence Day: ఎస్‌బీఐ నుంచి కొత్త స్కీమ్... 75 రోజులే అవకాశం

Independence Day: ఎస్‌బీఐ నుంచి కొత్త స్కీమ్... 75 రోజులే అవకాశం
(ప్రతీకాత్మక చిత్రం)

Independence Day: ఎస్‌బీఐ నుంచి కొత్త స్కీమ్... 75 రోజులే అవకాశం (ప్రతీకాత్మక చిత్రం)

Independence Day | భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా 'ఉత్సవ్ డిపాజిట్' (Utsav Deposit) పేరుతో సరికొత్త పథకాన్ని ప్రారంభించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సరికొత్త స్కీమ్ ప్రకటించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ని సెలబ్రేట్ చేస్తూ 'ఉత్సవ్ డిపాజిట్' (Utsav Deposit) పేరుతో సరికొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇవాళ్టి నుంచి 75 రోజుల్లో ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేసినవారికి ప్రత్యేక వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఆ తర్వాత ఈ స్కీమ్ అందుబాటులో ఉండదు. మళ్లీ పాత వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయి. ఎస్‌బీఐలో సాధారణంగా ఉండే వడ్డీ రేట్ల కన్నా ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకున్నవారికి ఎక్కువ వడ్డీ లభించనుంది.

'ఉత్సవ్ డిపాజిట్' ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు దాచుకునేవారికి 6.10 శాతం వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ టెన్యూర్ 1000 రోజులు. అంటే మూడేళ్ల లోపే. బ్యాంకులో మూడేళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అయితే ఇవాళ్టి నుంచి 75 రోజుల లోపు చేరితేనే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లు చేరితే అదనంగా 0.50 శాతం అంటే 6.60 శాతం వడ్డీ పొందొచ్చు.

PM Kisan 12th Installment: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త... వారికి మరో ఛాన్స్


ఎస్‌బీఐ రెండు రోజుల క్రితం ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన వడ్డీ రేట్లు 2022 ఆగస్ట్ 13 నుంచి అమలులోకి వచ్చాయి. తాజాగా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే


7 రోజుల నుంచి 45 రోజులు- 2.90 శాతం
46 రోజుల నుంచి 179 రోజులు- 3.90 శాతం
180 రోజుల నుంచి 210 రోజులు- 4.55 శాతం
211 రోజుల నుంచి ఏడాది- 4.60 శాతం
ఏడాది నుంచి రెండేళ్లు- 5.45 శాతం
రెండేళ్ల నుంచి మూడేళ్లు- 5.50 శాతం
మూడు నుంచి ఐదేళ్లు- 5.60 శాతం
ఐదేళ్ల నుంచి పదేళ్లు- 5.65 శాతం

SBI Loan: గుడ్ న్యూస్... ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా ఎస్‌బీఐ నుంచి రుణాలు

అన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అర శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. ఎస్‌బీఐ వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో డిపాజిట్ చేసినవారికి అదనంగా మరో 30 బేసిస్ పాయింట్స్ వడ్డీ లభిస్తుంది. తాజాగా ప్రకటించిన 'ఉత్సవ్ డిపాజిట్' ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేటు 6.10 శాతం.



మరోవైపు ఎస్‌బీఐ రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 15 నుంచి అమలులోకి వచ్చాయి. మూడు నెలల వరకు ఎంసీఎల్ఆర్ 7.15 శాతం నుంచి 7.35 శాతానికి పెరిగింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.45 శాతం నుంచి 7.65 శాతానికి పెరిగింది. ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 7.5 శాతం నుంచి 7.7 శాతానికి, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 7.7 శాతం నుంచి 7.9 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 7.8 శాతం నుంచి 8 శాతానికి పెరిగింది. దీంతో రుణాలు తీసుకున్నవారిపై ఈఎంఐల భారం పెరగనుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు