news18-telugu
Updated: June 14, 2020, 3:27 PM IST
SBI Account: ఇంటి నుంచే ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? ఎస్బీఐ అకౌంట్ తీసుకోవడం చాలా సులువైపోయింది. మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇంట్లో ఉండే అకౌంట్ ఓపెన్ చేయచ్చు. 'ఎస్బీఐ ఇన్‌స్టా సేవింగ్ బ్యాంక్ అకౌంట్' సర్వీస్‌ను మళ్లీ ప్రారంభించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఆధారంగా డిజిటల్ సేవింగ్స్ అకౌంట్‌ను సులువుగా ప్రారంభించొచ్చు. ఎస్బీఐకి చెందిన బ్యాంకింగ్, లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫామ్ అయిన YONO ద్వారా ఆన్లైన్ అకౌంట్ తీసుకోవచ్చు. ఎస్బీఐ ఇన్‌స్టా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లకు 24 గంటలు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఎస్బీఐ క్విక్ మిస్డ్ కాల్ సర్వీస్ లాంటి సేవల్ని కూడా పొందొచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి బేసిక్ పర్సనలైజ్డ్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డును జారీ చేస్తుంది బ్యాంకు.
మీరు ఎస్బీఐ ఇన్‌స్టా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కేవలం మీ స్మార్ట్‌ఫోన్‌లో యోనో యాప్ డౌన్లోడ్ చేస్తే చాలు. మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీ పూర్తి వివరాలు వెల్లడించాలి. నామినేషన్ సదుపాయం కూడా ఉంది కాబట్టి నామినీ పేరు వెల్లడించాలి. ప్రాసెస్ పూర్తి కాగానే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. వెంటనే లావాదేవీలు కూడా మొదలుపెట్టొచ్చు. కస్టమర్లు ఏడాదిలోపు ఎస్బీఐ బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి కేవైసీ వెల్లడించే అవకాశం ఉంటుంది. ఇక ఇటీవల ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సేవింగ్స్ అకౌంట్‌పై కేవలం 2.70 శాతం వడ్డీ మాత్రమే వస్తుంది.
ఇవి కూడా చదవండి:
SBI: ఎస్బీఐలో ఎక్కువ లాభాలు ఇచ్చే స్కీమ్ ఇదే...
Credit Card Loan: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే
SBI Gold Loan: బంగారంపై రుణాలు... తక్కువ వడ్డీకే ఇస్తామంటున్న ఎస్బీఐ
Published by:
Santhosh Kumar S
First published:
June 14, 2020, 3:27 PM IST