SBI Doorstep Banking: ఇంటికి వచ్చి సేవలు అందించే ఎస్‌బీఐ సిబ్బంది

SBI Doorstep Banking | నగదు జమ చేయాలన్నా, నగదు డ్రా చేయాలన్నా సేవలు పొందొచ్చు. క్యాష్ పికప్, క్యాష్ డెలివరీ, చెక్ పికప్, చెక్ రిక్విజిషన్ స్లిప్ పికప్, ఫామ్ 15హెచ్ పికప్, కేవైసీ డాక్యుమెంట్ పికప్స్, టర్మ్ డిపాజిట్ అడ్వైజ్, లైఫ్ సర్టిఫికెట్ పికప్ వాటికోసం 'డోర్‌స్టెప్ బ్యాంకింగ్' సేవలు పొందొచ్చు.

news18-telugu
Updated: March 12, 2019, 6:25 PM IST
SBI Doorstep Banking: ఇంటికి వచ్చి సేవలు అందించే ఎస్‌బీఐ సిబ్బంది
SBI Doorstep Banking: ఇంటికి వచ్చి సేవలు అందించే ఎస్‌బీఐ సిబ్బంది
news18-telugu
Updated: March 12, 2019, 6:25 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'డోర్‌స్టెప్ బ్యాంకింగ్' ప్రారంభించింది. 70 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, దివ్యాంగులు, ఇంటికే పరిమితమైన రోగులు, అంధులకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉంటే ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సేవలు కొన్ని బ్రాంచులు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. ఆ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పూర్తి కేవైసీ ఉన్న అకౌంట్ హోల్డర్లకు, అది కూడా హోమ్ బ్రాంచ్‌ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి మాత్రమే ఈ సేవలు అందుతాయి. జాయింట్ అకౌంట్, మైనర్ అకౌంట్, నాన్-పర్సనల్ అకౌంట్లకు ఈ సేవలు వర్తించవు. ఎస్‌బీఐ 'డోర్‌స్టెప్ బ్యాంకింగ్' సేవలు పొందేందుకు కస్టమర్లు తమ హోమ్ బ్రాంచ్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులు, ఇంటి నుంచి కదల్లేనివారు మెడికల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Read this: SBI Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఎస్‌బీఐలో IMPS NEFT వివరాలు ఇవే...

ఎస్‌బీఐ 'డోర్‌స్టెప్ బ్యాంకింగ్'లో ఏఏ సేవలు అందుతాయి?



నగదు జమ చేయాలన్నా, నగదు డ్రా చేయాలన్నా సేవలు పొందొచ్చు. క్యాష్ పికప్, క్యాష్ డెలివరీ, చెక్ పికప్, చెక్ రిక్విజిషన్ స్లిప్ పికప్, ఫామ్ 15హెచ్ పికప్, కేవైసీ డాక్యుమెంట్ పికప్స్, టర్మ్ డిపాజిట్ అడ్వైజ్, లైఫ్ సర్టిఫికెట్ పికప్ వాటికోసం 'డోర్‌స్టెప్ బ్యాంకింగ్' సేవలు పొందొచ్చు. నగదు డిపాజిట్, విత్‌డ్రా లిమిట్ రోజుకు రూ.20,000 మాత్రమే. అర్హులైన కస్టమర్లు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.100+జీఎస్టీ, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.60+ జీఎస్టీ చెల్లించి ఈ సేవలు పొందొచ్చు. వృద్ధులు, దివ్యాంగులు, అంధుల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే అన్ని బ్యాంకుల్ని కోరింది. దీంతో ఎస్‌బీఐ 'డోర్‌స్టెప్ బ్యాంకింగ్' పేరుతో కొత్త సేవల్ని ప్రారంభించింది.



Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్

ఇవి కూడా చదవండి:
Loading...
PAN Card: మీ దగ్గర రెండో పాన్ కార్డ్ ఉందా? ఇలా సరెండర్ చేయండి

GB WhatsApp: మీ జీబీ వాట్సప్ బ్లాక్ అయిందా? ఇలా చేయండి

RRB Level 1 Notification: రైల్వేలో 1,03,769 పోస్టులకు మొదలైన రిజిస్ట్రేషన్... ఇలా అప్లై చేయండి
First published: March 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...