SBI Wealth: మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? 'ఎస్‌బీఐ వెల్త్' గురించి తెలుసా?

SBI Wealth | 'ఎస్‌బీఐ వెల్త్' అకౌంట్ హోల్డర్‌కు సిగ్నేచర్ డెబిట్, క్రెడిట్ కార్డులు లభిస్తాయి. రివార్డ్ పాయింట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.

news18-telugu
Updated: August 1, 2019, 5:13 PM IST
SBI Wealth: మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? 'ఎస్‌బీఐ వెల్త్' గురించి తెలుసా?
SBI Wealth: మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? 'ఎస్‌బీఐ వెల్త్' గురించి తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త. ఇటీవల 'ఎస్‌బీఐ వెల్త్' పేరుతో సరికొత్త సేవల్ని ప్రారంభించింది బ్యాంకు. సాధారణంగా ఉండే బ్యాంకు వేళల్లోనే కాదు... సమయం దాటిపోయిన తర్వాత కూడా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. అయితే ఈ ప్రీమియం బ్యాంకింగ్ సేవలు కొద్దిమంది అకౌంట్ హోల్డర్లకు మాత్రమే. 'ఎస్‌బీఐ వెల్త్' సర్వీస్‌కు అర్హత పొందిన అకౌంట్ హోల్డర్లకు పర్సనలైజ్డ్ బ్యాంకింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. వారి కోసం ఓ రిలేషన్‌షిప్ మేనేజర్‌ ప్రత్యేకంగా ఉంటారు. బ్యాంకులో ఎలాంటి పనులు ఉన్నా ఖాతాదారులు రిలేషన్‌షిప్ మేనేజర్‌ను సంప్రదించొచ్చు. రిలేషన్‌షిప్ మేనేజర్‌తో వాయిస్ లేదా వీడియో కాల్స్‌లో మాట్లాడి సేవలు పొందొచ్చు. కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్స్ మీరు ఉన్న చోటికి వచ్చి డాక్యుమెంట్స్ తీసుకెళ్తారు. అంతేకాదు... 'ఎస్‌బీఐ వెల్త్' అకౌంట్ హోల్డర్‌కు సిగ్నేచర్ డెబిట్, క్రెడిట్ కార్డులు లభిస్తాయి. రివార్డ్ పాయింట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్‌లో మరిన్ని సేవలు లభిస్తాయి. రుణాల మంజూరు విషయంలోనూ వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ఎస్‌బీఐ వెల్త్ కస్టమర్లకు వెబ్‌సైట్, మొబైల్ యాప్ ప్రత్యేకంగా ఉంటుంది.


SBI Wealth: ఎస్‌బీఐ వెల్త్ అకౌంట్‌కు ఎవరు అర్హులు?


ఎస్‌బీఐ వెల్త్ పాత కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్లకూ వర్తిస్తుంది. ఎగ్జిస్టింగ్ టు బ్యాంక్-ETB కస్టమర్ అంటే పాత అకౌంట్‌హోల్డర్‌ అయితే ఎస్‌బీఐ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్, డీమ్యాట్ హోల్డింగ్స్ మొత్తం కలిపి రూ.30 లక్షల వరకు ఉండాలి. లేదా వేతనం రూ.2 లక్షలు, ఎస్‌బీఐ హోమ్‌లోన్ రూ.1 కోటి లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఇక న్యూ టు బ్యాంక్-NTB క్లైంట్ అంటే కొత్త కస్టమర్ అయితే ప్రారంభ డిపాజిట్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ రూ.10 లక్షలు ఉండాలి. 12 నెలల్లో రూ.30 లక్షల వరకు రిలేషన్‌షిప్ వ్యాల్యూ ఉండాలి. సాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే జీతం రూ.2 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. కొత్తగా తీసుకునే హోమ్ లోన్ రూ.1 కోటి కన్నా ఎక్కువ ఉండాలి.

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి...


ఇవి కూడా చదవండి:New Rules: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానా... కొత్త ఫైన్స్ ఇవే

WhatsApp: వాట్సప్ 1000 జీబీ ఇంటర్నెట్ డేటా ఉచితంగా ఇస్తోందా?

LIC Plan: రోజుకు రూ.29... రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్... ఇంకెన్నో లాభాలు
Published by: Santhosh Kumar S
First published: August 1, 2019, 5:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading