Home /News /business /

కస్టమర్లకు ఎస్‌బీఐ కొత్త వార్నింగ్... తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

కస్టమర్లకు ఎస్‌బీఐ కొత్త వార్నింగ్... తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కస్టమర్లకు ఫేక్ బ్యాంక్ యాప్స్ పెద్ద సమస్యగా మారింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమకు ఏఏ సైట్లల్లో అఫిషియల్ హ్యాండిల్స్ ఉన్నాయో వివరిస్తూ ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. వెరిఫైడ్, అఫిషియల్ హ్యాండిల్స్‌ని మాత్రమే ఫాలో కావాలని సూచిస్తోంది.

    మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమరా? మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. కారణం... ఇటీవల పెరిగిపోతున్న మోసాల విషయంలో అప్రమత్తం చేస్తోంది. ధృవీకరించిన, అధికారిక ఎస్‌బీఐ హ్యాండిల్స్ ద్వారానే తమతో సంప్రదించాలని కస్టమర్లకు సూచిస్తోంది. ఈరోజుల్లో సైబర్ నేరాలు కొత్తేమీ కాదు. సర్వసాధారణమైపోయాయి. టెక్నాలజీ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదువుతున్న సైబర్ నేరగాళ్లు... ఆన్‌లైన్‌లో ఈజీగా నేరాలు చేసేస్తున్నారు. ఎక్కువగా ఆర్థిక నేరాలే ఉంటున్నాయి.

    కస్టమర్లకు ఫేక్ బ్యాంక్ యాప్స్ పెద్ద సమస్యగా మారింది. దానికి తోడు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. అందుకే వీటన్నింటి నుంచీ కాపాడేందుకు స్వయంగా బ్యాంకులే రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే పని చేస్తోంది. తమకు ఏఏ సైట్లల్లో అఫిషియల్ హ్యాండిల్స్ ఉన్నాయో వివరిస్తూ ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. వెరిఫైడ్, అఫిషియల్ హ్యాండిల్స్‌ని మాత్రమే ఫాలో కావాలని సూచిస్తోంది.



    గూగుల్, యాపిల్ యాప్ స్టోర్స్‌లో ఉన్నంత మాత్రానా అన్ని యాప్స్ ఒరిజినల్ కావు. అందుకే మీరు బ్యాంక్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మరి ఒరిజినల్ యాప్స్, డూప్లికేట్ యాప్స్ ఎలా గుర్తించాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

    ఇవి కూడా చదవండి:

    ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ తప్పు చేయకండి

    షాక్... మీరు యాప్ వాడకున్నా ట్రాక్ చేస్తున్న ఫేస్‌బుక్

    సిమ్ కార్డుతో మీ అకౌంట్ ఖాళీ... జాగ్రత్తలు తెలుసుకోండి

    2019లో వాట్సప్‌లో కొత్తగా వచ్చే ఫీచర్లు ఇవేనా?

     
    First published:

    Tags: Sbi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు