SBI: గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ... ఏటీఎంలో ఓటీపీతో డబ్బులు డ్రా చేయండి ఇలా

SBI OTP-based cash withdrawal | ఏటీఎంలల్లో అనధికార లావాదేవీలు పెరిగిపోతుండటంతో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ఎస్‌బీఐ. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి చేసింది ఎస్‌బీఐ.

news18-telugu
Updated: December 27, 2019, 10:24 AM IST
SBI: గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ... ఏటీఎంలో ఓటీపీతో డబ్బులు డ్రా చేయండి ఇలా
SBI: గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ... ఏటీఎంలో ఓటీపీతో డబ్బులు డ్రా చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేయాలంటే వన్ టైమ్ పాస్‌వర్డ్-OTP తప్పనిసరి. 2020 జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. ఇప్పటికే కెనరా బ్యాంకు ఏటీఎంలల్లో ఇదే విధానం ఉంది. దేశంలోని ఎస్‌బీఐ ఏటీఎంలల్లో ఇది వర్తిస్తుంది. 2020 జనవరి 1 నుంచి మీరు ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ నియమం వర్తిస్తుంది. ఏటీఎంలల్లో అనధికార లావాదేవీలు పెరిగిపోతుండటంతో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ఎస్‌బీఐ. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి చేసింది ఎస్‌బీఐ.

ఓటీపీ బేస్డ్ క్యాష్ విత్‌డ్రాయల్ ఎలా పనిచేస్తుందంటే...


ఉదాహరణకు మీరు ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు రాత్రి 8 గంటల తర్వాత వెళ్లారనుకుందాం. మీరు కార్డు ఇన్సర్ట్ చేసి పిన్ ఎంటర్ చేస్తే సరిపోదు. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే డబ్బులు వస్తాయి. అంటే మీరు కార్డు ఇన్సర్ట్ చేసి ఓటీపీ తప్పనిసరిగా టైప్ చేయాలి. అప్పుడే డబ్బులు డ్రా అవుతాయి. దీని వల్ల కస్టమర్ల ఖాతాలకు మరింత సెక్యూరిటీ లభించినట్టే. మీ కార్డు పోగొట్టుకున్నా, వారికి పిన్ తెలిసినా డబ్బులు డ్రా చేయలేరు. అయితే ఈ విధానం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది.




ఓటీపీ బేస్డ్ క్యాష్ విత్‌డ్రాయల్ కోసం ప్రస్తుతం ఉన్న ఏటీఎంలల్లో పెద్దగా ఎలాంటి సాంకేతిక మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఈ విధానం కేవలం ఎస్‌బీఐ ఏటీఎంలల్లో మాత్రమే ఉంటుంది. మీరు ఇతర ఏటీఎంలల్లోకి వెళ్తే మామూలుగానే డబ్బులు డ్రా చేయొచ్చు. కార్డ్ క్లోనింగ్, కార్డ్ స్కిమ్మింగ్ లాంటి మోసాలను అడ్డుకట్ట వేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదనపు సెక్యూరిటీ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది.

ఇప్పటికే ఎస్‌బీఐ యోనో క్యాష్‌ సర్వీస్‌ను అందిస్తోంది. ఏటీఎం కార్డు అవసరం లేకుండా ఎస్‌బీఐ కస్టమర్లు యోనో క్యాష్ పాయింట్స్‌లో డబ్బులు డ్రా చేసుకునే విధానం ఇది. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లు ఈ సేవల్ని వాడుకోవచ్చు. యోనో క్యాష్ పాయింట్‌లో కేవలం ఆరు అంకెల పిన్ ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేయొచ్చు. యోనో క్యాష్‌లో టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంటుంది.

రూ.8,199 ధరకే నోకియా 2.3 సేల్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

SBI Gold Scheme: మీ నగలు డిపాజిట్ చేస్తే ఎస్‌బీఐ నుంచి వడ్డీ... ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి

EPF e-Nomination: 10 నిమిషాల్లో పీఎఫ్ అకౌంట్‌లో నామినీ పేరు అప్‌డేట్ చేయండి ఇలా

December 31 Deadline: ఈ రెండు పనులకు డిసెంబర్ 31 లాస్ట్ డేట్
First published: December 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు