హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI: ఎస్‌బీఐలో అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు తెచ్చిన బ్యాంక్

SBI: ఎస్‌బీఐలో అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు తెచ్చిన బ్యాంక్

ఎస్‌బీఐలో అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు తీసువచ్చిన బ్యాంక్

ఎస్‌బీఐలో అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు తీసువచ్చిన బ్యాంక్

SBI FASTag | మీరు ఎస్‌బీఐ కస్టమరా? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ తాజాగా కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  FASTag | దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు తీపికబురు అందించింది. ఎస్‌బీఐ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఎస్ఎంఎస్ సర్వీసులు ఆవిష్కరించింది. ఫాస్టాగ్ వినియోగం వల్ల చేతిలో డబ్బులు ఉండాల్సిన పని లేదు. టోల్ ప్లాజాల (Toll Plaza) వద్ద చార్జీలు ఆటోమేటిక్‌గానే ఫాస్టాగ్ నుంచి కట్ అవుతాయి. ఫాస్టాగ్స్ బ్యాంక్ అకౌంట్‌తో (Bank Account) లింక్ చేసుకోవచ్చు. అంటే డబ్బులతో రీచార్జ్ చేయొచ్చు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్స్ పని చేస్తాయి. వాహనదారులు ఫాస్టాగ్ స్టిక్కర్‌ను వారి వెహికల్ గ్లాస్‌కు అతికించుకోవాల్సి ఉంటుంది.

  ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎస్‌బీఐ ఫాస్టాగ్ కస్టమర్లు వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 7208820019కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చని స్టేట్ బ్యాంక్ తెలిపింది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కలిగిన వారికి మాత్రమే ఈ సేవలు లభిస్తాయని గుర్తించుకోవాలి. ఫాస్టాగ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలని భావిస్తే.. ఎఫ్‌టీబీఏఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి పైన ఇచ్చిన నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఒకటి కన్నా ఎక్కువ వెహికల్స్ కలిగిన వారికి ఇది వర్తిస్తుంది. అదే ఒకే వెహికల్ ఉంటే అప్పుడు ఎఫ్‌టీబీఏఎల్ అని ఎస్ఎంఎస్ పంపిస్తే సరిపోతుంది.

  గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? దీని వెనక అంత పెద్ద కారణం ఉందా?

  ట్రాఫిక్ తగ్గించడానికి, ఇంధన ఆదా, కాలుష్య తగ్గింపు వంటి అంశాలు లక్ష్యంగా ప్రభుత్వం ఫాస్టాగ్ సర్వీసులు తీసుకువచ్చింది. ఫాస్టాగ్స్ వల్ల టోల్ ప్లాజాల వద్ద నిమిషాల కొద్ది వేచి చూడాల్సిన పని లేదు. నేరుగా వెళ్లిపోవచ్చు. ఇదివరకు టోల్ ప్లాజాల వద్ద చాలా ట్రాఫిక్ ఉండేది. ఇప్పుడు ఈ సమస్య లేదని చెప్పుకోవచ్చు. ఫాస్టాగ్ వల్ల టోల్ చార్జీల చెల్లింపు త్వరితగతిన జరిగిపోతోంది. క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి.

  డబ్బు సంపాదించాలనుకునే వారికి అద్భుత అవకాశం.. సెప్టెంబర్ 14న మిస్ అవ్వొద్దు!

  దేశంలో 2021 జనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి అయ్యింది. క్లాస్ ఎం, ఎన్ వెహికల్స్ అన్నింటికీ ఫాస్టాగ్ ఉండాల్సిందే. గూడ్స్ లేదా ప్యాసింజర్లకు ట్రాన్స్‌పోర్ట్ చేసే అన్ని వెహికల్స్‌కు ఇది వర్తిస్తుంది. అంతేకాకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలన్నా కూడా ఫాస్టాగ్ ఉండాల్సిందే. లేదంటే పాలసీ తీసుకోవడం కుదరదు. ఎస్‌బీఐ కస్టమర్లకు ఐదేళ్ల వాలిడిటీతో ఫాస్టాగ్‌లను అందిస్తోంది. వీటిని రీచార్జ్ చేసుకుంటూ ఉండాలి.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Bank, Bank account, Sbi, Sbi yono, State bank of india

  ఉత్తమ కథలు