హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... కొత్త ఓటీపీ సర్వీస్ ప్రారంభం

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... కొత్త ఓటీపీ సర్వీస్ ప్రారంభం

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... కొత్త ఓటీపీ సర్వీస్ ప్రారంభం
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... కొత్త ఓటీపీ సర్వీస్ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిజిటల్ లావాదేవీలు చేసేవారి కోసం కొత్త ఓటీపీ సర్వీస్ ప్రారంభించింది. ఎలా యాక్టివేషన్ చేయాలో వివరించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు అలర్ట్. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ డిజిటల్ లావాదేవీల్లో (Digital Transactions) భద్రతను మరింతగా పెంచేందుకు కొత్తగా ఇమెయిల్ ఓటీపీ ఆథెంటికేషన్ సర్వీస్ ప్రారంభించింది. ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తే కస్టమర్ల రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్‌కు ఓటీపీ నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ స్టెప్ ద్వారా కస్టమర్లు ఇమెయిల్ ఓటీపీ ఉపయోగించి తమ లావాదేవీలను సురక్షితంగా మార్చుకోవచ్చు. ఖాతాదారులు వెంటనే రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్‌లకు ఓటీపీ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయాలని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.

ఎస్‌బీఐ ఇమెయిల్ ఓటీపీ నోటిఫికేషన్ ఎలా యాక్టివేట్ చేయాలి?

ఎస్‌బీఐ కస్టమర్లు retail.onlinesbi.sbi వెబ్‌సైట్‌లో ఇమెయిల్ ఓటీపీ నోటిఫికేషన్స్‌ని యాక్టివేట్ చేయొచ్చు. యాక్టివేషన్ చేసిన తర్వాత ప్రతీ డిజిటల్ లావాదేవీకి కస్టమర్లకు ఇమెయిల్‌కు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే ఈ కింది స్టెప్స్ ద్వారా ఇమెయిల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి.

LIC New Plan: రోజుకు రూ.20 లోపు ప్రీమియం... కోటి రూపాయల ఇన్స్యూరెన్స్

Step 1- ముందుగా retail.onlinesbi.sbi వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

Step 2- నెట్ బ్యాంకింగ్ కోసం మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అవండి.

Step 3- ఆ తర్వాత ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లండి.

Step 4- High Security ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి.

Step 5- అందులో ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా ఓటీపీల కోసం వేర్వేరు ఆప్షన్స్ ఉంటాయి.

Step 6- మీ ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేసి ఓటీపీ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి.

Step 7- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

Third Party Insurance: టూవీలర్లకు రూ.538 నుంచి, కార్లకు రూ.2,094 ఇన్సూరెన్స్‌ ప్రీమియం

ఎస్‌బీఐ కస్టమర్లు యోనో లైట్ ఎస్‌బీఐ, ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో లావాదేవీలు జరిపినప్పుడు ఓటీపీ ఇమెయిల్ ఐడీకి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ పూర్తి చేయొచ్చు. ఆన్‌లైన్ మోసాలను అరికట్టడం కోసం ఎస్‌బీఐ ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిలో ఓటీపీ మోసాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా మీకు కాల్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీ లాంటి సున్నితమైన డీటెయిల్స్ అడుగుతున్నారంటే మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాలి. report.phishing@sbi.co.in మెయిల్ ఐడీకి వివరాలు పంపి మీరు కంప్లైంట్ చేయొచ్చు.

First published:

Tags: CYBER CRIME, Mobile Banking, Sbi, State bank of india

ఉత్తమ కథలు