హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Offer: ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్... జనవరి 31 వరకే ఛాన్స్

SBI Offer: ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్... జనవరి 31 వరకే ఛాన్స్

SBI Offer: ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్... జనవరి 31 వరకే ఛాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Offer: ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్... జనవరి 31 వరకే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

SBI Offer | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొద్ది రోజుల క్రితం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది ఈ ఆఫర్ జనవరి 31న ముగియనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రకటించిన హోమ్ లోన్ ఆఫర్ మరో 6 రోజుల్లో ముగియనుంది. ఈ ఆఫర్‌లో భాగంగా ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లను (Home Loan Interest Rates) తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రాసెసింగ్ ఫీజును కూడా మినహాయించింది. ఈ ఆఫర్ 2023 జనవరి 31 వరకే అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. కస్టమర్లు తక్కువ వడ్డీకే రుణాలు పొందడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. ఈ ఆఫర్‌లో భాగంగా గృహ రుణాల వడ్డీ రేటుపై 30 బేసిస్ పాయింట్స్ వరకు తగ్గింపు ప్రకటించింది ఎస్‌బీఐ. సాధారణ హోమ్ లోన్ వడ్డీ రేట్ల కన్నా ఈ ఆఫర్‌లో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.

ఇక ఇటీవల ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్స్ పెంచింది. జనవరి 15 నుంచి ఈ పెంపు అమలులోకి వచ్చింది. ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 8.30 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.50 శాతం, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.60 శాతంగా ఉంది. ఇక ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8 శాతంగా ఉంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.85 శాతం.

Vande Bharat Express: వచ్చే నెలలో 9వ వందే భారత్ రైలు ప్రారంభం... రూట్ ఇదే

మంచి సిబిల్ స్కోర్ ఉన్నవారికి 15 బేసిస్ పాయింట్స్ నుంచి 30 బేసిస్ పాయింట్స్ వరకు తగ్గింపు లభిస్తుంది. హోమ్ లోన్ వడ్డీ రేటుపై డిస్కౌంట్ సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడీకే రుణాలు లభిస్తాయి. సిబిల్ స్కోర్ 800 పైన ఉంటే హోమ్ లోన్ వడ్డీ రేటు 8.90 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గుతుంది. 15 బేసిస్ పాయింట్స్ తగ్గింపు పొందొచ్చు.

సిబిల్ స్కోర్ 750 నుంచి 799 పాయింట్లు వడ్డీ రేటు 9 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గుతుంది. 25 బేసిస్ పాయింట్స్ తగ్గింపు పొందొచ్చు. ఇక సిబిల్ స్కోర్ 700 నుంచి 749 మధ్య ఉంటే వడ్డీ రేటు 9.10 శాతం నుంచి 8.90 శాతానికి తగ్గుతుంది. 20 బేసిస్ పాయింట్స్ తగ్గింపు పొందొచ్చు. 700 లోపు క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.

Dating Scam: డేటింగ్ స్కామ్స్‌తో జాగ్రత్త... ఈ టిప్స్ గుర్తుంచుకోండి

సిబిల్ స్కోర్ 650 నుంచి 699 మధ్య ఉంటే 9.20 శాతం వడ్డీ, క్రెడిట్ స్కోర్ 550 నుంచి 649 మధ్య ఉంటే 9.40 శాతం వడ్డీ, సిబిల్ స్కోర్ లేనివారికి 9.10 శాతం వడ్డీ వర్తిస్తుంది. రూ.6 లక్షల కోట్లకు పైగా గృహ రుణాలు ఇచ్చినట్టు ఇటీవల ఎస్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. హోమ్ లోన్ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం అనేక ఆఫర్స్ ప్రకటిస్తోంది. మరి ఈ ఆఫర్ ద్వారా మీరు హోమ్ లోన్‌కు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

ఎస్‌బీఐ హోమ్ లోన్‌కు అప్లై చేయడానికి యోనో ఎస్‌బీఐ యాప్ ఓపెన్ చేయాలి.

టాప్ లెఫ్ట్ కార్నర్‌లో త్రీ లైన్స్ పైన క్లిక్ చేయాలి.

లోన్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి.

హోమ్ లోన్ పైన క్లిక్ చేయాలి.

పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.

ఆదాయ మార్గాల వివరాలు తెలపాలి.

నెలవారీ ఆదాయ వివరాలు ఎంటర్ చేయాలి.

ఇతర వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

మీకు ఎంత వరకు లోన్ వస్తుందో వివరాలు తెలుస్తాయి.

మిగతా వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ఈ ప్రాసెస్ పూర్తైన తర్వాత మీకు ఎస్‌బీఐ ఎగ్జిక్యూటీవ్ నుంచి కాల్ వస్తుంది.

మిగతా లోన్ ప్రాసెస్ వివరిస్తారు.

First published:

Tags: Home loan, Housing Loans, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు