Home /News /business /

STATE BANK OF INDIA HIKES ITS MARGINAL COST OF LENDING RATE MAY RESULT IN AN INCREASE IN THE EMIS OF HOME CAR AND OTHER LOANS GH SRD

SBI: ఈఎంఐలు కట్టే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాక్.. లోన్‌ వడ్డీ రేట్లుపై ఇక బాదుడే.. ఎంతంటే..

State Bank Of India

State Bank Of India

SBI: ఎస్‌బీఐ ఏప్రిల్ 2022 నుంచి రుణాలపై తన MCLRను పెంచుకుంటూ వస్తోంది. గతంలో రుణ రేట్‌కు సంబంధించిన మార్జినల్ కాస్డ్‌ను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఇది జులై 25, 2022 నుంచి అమల్లోకి వచ్చింది.

దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(MCLR) పెంచుతున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. 20 బేసిస్ పాయింట్లతో ఎంసీఎల్‌ఆర్‌ను పెంచింది. ఇక్కడ ఒక బేసిస్ పాయింట్ వందోవంతు పర్సెంటేజ్ పాయింట్‌కు సమానం. ఆ లెక్కన ఎస్‌బీఐ (State Bank Of India) ఎంసీఎల్‌ఆర్ పెంపుతో లోన్లపై వడ్డీలు 0.20శాతం పెరగనున్నాయి.ఎస్‌బీఐ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ పెంపు ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. అన్ని రకాల కాల వ్యవధులకు ఇది వర్తించనుంది. దీంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న, భవిష్యత్తులో రుణగ్రహీతలు తీసుకోబోయే ఇల్లు, కారు, ఇతర రుణాలకు సంబంధించిన ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంది.

* పెరిగిన ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్ ఇలా
ఓవర్ నైట్: పాత రేటు- 7.15 శాతం; కొత్త రేటు - 7.35 శాతం
ఒక నెల: పాత రేటు - 7.15 శాతం; కొత్త రేటు - 7.35 శాతం
మూడు నెలలు: పాత రేటు - 7.15 శాతం; కొత్త రేటు - 7.35 శాతం
ఆరు నెలలు: పాత రేటు - 7.45 శాతం; కొత్త రేటు - 7.65 శాతం
ఒక సంవత్సరం: పాత రేటు - 7.50 శాతం; కొత్త రేటు - 7.70 శాతం
రెండేళ్లు: పాత రేటు- 7.70 శాతం; కొత్త రేటు - 7.90 శాతం
మూడు సంవత్సరాలు: పాత రేటు - 7.80 శాతం; కొత్త రేటు - 8.00 శాతం



ఎస్‌బీఐ ఏప్రిల్ 2022 నుంచి రుణాలపై తన MCLRను పెంచుకుంటూ వస్తోంది. గతంలో రుణ రేట్‌కు సంబంధించిన మార్జినల్ కాస్డ్‌ను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఇది జులై 25, 2022 నుంచి ఆమల్లోకి వచ్చింది. ఎస్‌బీఐ, ఎంసీఎల్‌ఆర్ మాత్రమే కాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్‌ సైతం పెంచింది. ఇది ఆగస్టు 13 నుంచి అమల్లోకి వచ్చింది.

మరోపక్క.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్టు ప్రారంభంలో కీలకమైన రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది. సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ మేలో ఆఫ్-సైకిల్ పాలసీ సమీక్షలో 40 బేసిస్ పాయింట్లు, జూన్ మానిటరీ పాలసీ కమిటీ సమయంలో 50 బేసిస్ పాయింట్లు పెంచిన తర్వాత రెండు నెలల్లో ఇది రెండో పెంపు కావడం గమనార్హం.

జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.71 శాతానికి తగ్గింది. ఇది RBI లక్ష్య పరిమితి 2-6 శాతం కంటే ఎక్కువ. అయితే, సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లలో బ్యాక్ టూ బ్యాక్ పెంపుదల ఏప్రిల్‌లో గరిష్ట స్థాయి నుంచి ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయపడింది.

ఇది కూడా చదవండి : బాప్ రే.. ఇంటర్నెట్‌లో ప్రతి 10 మందిలో ఆరుగురు తెలుసుకుంటుంది ఇదా..!

* ఎంసీఎల్‌ఆర్ (MCLR)
మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(MCLR) అనేది బెంచ్‌మార్క్ వడ్డీ రేటు. ఇది బ్యాంకులు తన కస్టమర్‌లకు రుణాలు ఇవ్వడానికి అనుమతించే కనీస వడ్డీ రేటు. కస్టమర్లకు ఫ్లోటింగ్ రేట్ లోన్‌ల మెరుగైన ధరను నిర్ధారించడానికి ఆర్‌బీఐ 2016లో ఎంసీఎల్‌ఆర్‌ను ప్రవేశపెట్టింది.

ఎంసీఎల్‌ఆర్(MCLR) పెరుగుదలతో ఎస్‌బీఐ గృహ, ఇతర రుణగ్రహీతలు కొంత నిరాశకు గురికావచ్చు. ఎందుకంటే వడ్డీలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే రుణాలు తీసుకున్న, భవిష్యత్తులో తీసుకునే రుణగ్రహీతలకు వర్తిస్తుంది. గృహ రుణాలపై వడ్డీ బ్యాంకు MCLRతో అసోసియేట్ అయి ఉంటుంది. దీంతో గృహ రుణాల వడ్డీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: EMI, Mclr, Sbi, Sbi loans, State bank of india

తదుపరి వార్తలు