హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Good News: ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SBI Good News: ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SBI Good News: ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Good News: ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ప్రతీకాత్మక చిత్రం)

SBI Good News | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (SBI FD Rates) పెంచింది. కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. ఓ స్కీమ్‌లో ఉన్నవారికి అదనంగా వడ్డీ ఇస్తోంది ఎస్‌బీఐ.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను భారీగా పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు 2022 జూన్ 14 నుంచే అమలులోకి వచ్చాయి. 211 రోజుల నుంచి 3 ఏళ్ల మధ్య రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేట్ (Repo Rate) పెంచిన సంగతి తెలిసిందే. జూన్ 8న ఆర్‌బీఐ 50 బేసిస్ పాయింట్స్ అంటే అర శాతం వడ్డీ రేట్లను (Interest Rates) పెంచింది. దీంతో బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను ఇప్పటికే పెంచాయి. ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెంచుతూ కస్టమర్లకు లాభం చేస్తున్నాయి. అందులో భాగంగా ఎస్‌బీఐ 20 బేసిస్ పాయింట్స్ వరకు ఎఫ్‌డీ రేట్లను పెంచింది.

ఎస్‌బీఐలో తాజాగా వడ్డీ రేట్లను చూస్తే 7 రోజుల నుంచి 45 రోజుల కాల్య వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 2.90 శాతం వడ్డీ, 46 రోజుల నుంచి 179 రోజుల కాల్య వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 3.90 శాతం వడ్డీ వస్తుంది. ఇక 180 రోజుల నుంచి 210 రోజుల కాల్య వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 4.40 శాతం వడ్డీ పొందొచ్చు. 211 రోజుల నుంచి ఏడాది కాల్య వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 4.60 శాతం వడ్డీ లభిస్తుంది. ఏడాది నుంచి రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 5.30 శాతం వడ్డీ లభిస్తుంది.

LIC Policy: రోజుకు రూ.45 పొదుపు చేస్తే ఏటా రూ.36,000 రిటర్న్స్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే

రెండేళ్ల నుంచి మూడేళ్ల ఎఫ్‌డీపై 5.35 శాతం వడ్డీ, మూడు నుంచి ఐదేళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 5.45 శాతం వడ్డీ, ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు ఎఫ్‌డీలకు 5.50 శాతం వడ్డీ పొందొచ్చు. ఇక అన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ అంటే అర శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. ఇక ఎస్‌బీఐలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా ఎస్‌బీఐ వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ఉంది.

ఎస్‌బీఐ వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో అదనంగా మరో 30 బేసిస్ పాయింట్స్ వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. సాధారణంగా ఎస్‌బీఐ 5.50 శాతం వడ్డీ ఇస్తే, ఎస్‌బీఐ వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో 80 బేసిస్ పాయింట్స్ అంటే 80 పైసలు అదనంగా వడ్డీ పొందొచ్చు. ఈ స్కీమ్‌లో 6.30 శాతం వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ 2022 సెప్టెంబర్ 30 వరకే అందుబాటులో ఉంటుంది.

UPI Payment: ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం పేమెంట్స్ చేస్తున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి

రిటైర్మెంట్ సమయంలో లేదా ఇతర సందర్భాల్లో భారీ మొత్తంలో డబ్బులు వచ్చినవారు వడ్డీ కోసం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తుంటారు. అందుకే బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ పాపులర్. అయితే బ్యాంకులు తరచూ వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. ఆ విషయాన్ని ఖాతాదారులు గుర్తుంచుకోవాలి.

First published:

Tags: FD rates, Interest rates, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు