Home /News /business /

STATE BANK OF INDIA HAS TAKEN A KEY DECISION BY RAISING INTEREST RATES ON LONG TERM FIXED DEPOSITS CLICK HERE FOR DETAILS PRV GH

SBI Fixed Deposits: ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్​న్యూస్​.. లాంగ్ టర్మ్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) కస్టమర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. లాంగ్​ టర్మ్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of india) కస్టమర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. లాంగ్​ టర్మ్​ ఫిక్స్​డ్​ డిపాజిట్ల (Long Term Fixed deposits)పై వడ్డీ రేట్లు (Interest rates) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 2 సంవత్సరాలకు పైబడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (SBI Fixed deposits) 10 నుంచి -15 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు 2022 ఫిబ్రవరి 15 నుంచి వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఎస్​బీఐ (SBI) వెబ్‌సైట్​లో పేర్కొన్న వివరాల ప్రకారం, 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు గల ఎఫ్​డీలపై వడ్డీ రేటు (Interest rate) 10 బేసిస్​ పాయింట్లు (Basis points) పెరిగి 5.20 శాతానికి, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు గల ఎఫ్​డీ (SBI Fixed deposits)లపై 15 బేసిస్​ పాయింట్లు పెరిగి 5.45 శాతానికి చేరింది.

10 సంవత్సరాల వరకు గల ఎఫ్​డీ..

ఇక, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్​డీ (SBI Fixed deposits)ల కాలపరిమితిలో వడ్డీ రేటు 10 బేసిస్​ పాయింట్లు పెరిగి 5.50 శాతానికి చేరుకుంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు గల ఎఫ్​డీ (SBI Fixed deposits)లపై వడ్డీ రేటు 10 బేసిస్ పెరిగి 5.50 శాతానికి చేరుకుంది. కాగా, 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధి గల ఎఫ్​డీ (SBI Fixed deposits)లపై వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు ఉండదు. పెరిగిన వడ్డీ రేట్లు (Increased Interest rates) రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన ఎఫ్‌డీలకు మాత్రమే వర్తిస్తాయి.

రూ. 2 కోట్లలోపు డిపాజిట్లపై..

కాగా, ఎస్​బీఐ (SBI) గత నెలలో కూడా వడ్డీ రేట్ల (Interest rates)ను సవరించింది. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య గల ఎఫ్​డీ (SBI Fixed deposits)ల వడ్డీ రేటును 10 బేసిస్​ పాయింట్ల చొప్పున పెంచింది. ఈ వడ్డీ రేటు కూడా రూ. 2 కోట్లలోపు డిపాజిట్ల (Deposits)పై మాత్రమే వర్తిస్తాయి. దీని ద్వారా ఏడాది నుంచి రేండేళ్ల వ్యవధి గల ఎఫ్​డీలకు 5.1 శాతానికి చేరుకున్నాయి. ఇదే వ్యవధిలో సీనియర్ సిటిజన్లకు 5.6% (5.5% నుండి) వడ్డీ లభిస్తుంది. జనవరి 15, 2022 నుండి ఈ వడ్డీ రేటు అమల్లోకి వచ్చింది.

ఎఫ్​డీ పెట్టుబడిదారులకు శుభవార్త

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) ఫిబ్రవరి 10, 2022న ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో రెపో (Repo), రివర్స్ రెపో రేట్ల (Reverse repo rates)ను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. RBI మానిటరీ పాలసీ ప్రకటించిన ఒక రోజు తర్వాత, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central bank of india, యూకో బ్యాంక్ ఫిబ్రవరి 10, 2022 నుండి అమల్లోకి వచ్చేలా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించాయి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: BUSINESS NEWS, Fixed deposits, Interest rates, Sbi, State bank of india

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు