Home /News /business /

STATE BANK OF INDIA HAS NOT YET REPAID THE ADDITIONAL FEE OF RS 164 CRORE TAKEN FROM PRIME MINISTER JAN DHAN YOJANA ACCOUNTS PRV GH

SBI fees: జన్‌ ధన్ ఖాతాదారులకు ఎస్బీఐ రూ.164 కోట్ల బకాయిలు.. అదనపు రుసుముల రీఫండ్‌లో స్టేట్ బ్యాంక్ జాప్యం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాదారుల నుంచి వసూలు చేసిన రూ. 164 కోట్ల అదనపు రుసుమును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంకా తిరిగి ఇవ్వలేదని తాజా నివేదిక వెల్లడించింది. 2017 ఏప్రిల్ నుంచి 2019 డిసెంబర్ మధ్య డిజిటల్ చెల్లింపుల కోసం PMJDY ఖాతాదారుల నుంచి ఎస్బీఐ అదనపు రుసుమును వసూలు చేసింది.

ఇంకా చదవండి ...
మన దేశంలో ప్రధాన ప్రభుత్వ బ్యాంకులు విధించే జరిమానాలు కస్టమర్లకు శాపాలుగా మారుతున్నాయి. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి వసూలు చేసే అదనపు రుసుములను తిరిగి చెల్లించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాదారుల నుంచి వసూలు చేసిన  రూ. 164 కోట్ల అదనపు రుసుమును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంకా తిరిగి ఇవ్వలేదని తాజా నివేదిక వెల్లడించింది. 2017 ఏప్రిల్ నుంచి 2019 డిసెంబర్ మధ్య డిజిటల్ చెల్లింపుల కోసం PMJDY ఖాతాదారుల నుంచి ఎస్బీఐ అదనపు రుసుమును (SBI fees) వసూలు చేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు SBI కేవలం రూ.90 కోట్లను తిరిగి ఇచ్చింది. కానీ ఇంకా కనీసం రూ.164 కోట్ల మొత్తాన్ని మాత్రం నిలిపివేసినట్లు IIT-ముంబై రూపొందించిన ఈ నివేదిక పేర్కొంది.

లావాదేవీకి రూ. 17.70 చొప్పున రూ. 254 కోట్లు..

2017 ఏప్రిల్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద BSBDA (బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ఖా తాదారుల నుంచి ఎస్బీఐ అదనపు రుసుము (SBI fees) వసూలు చేసింది. కనీసం 14 కోట్ల UPI/రూపే లావాదేవీలపై.. ప్రతి లావాదేవీకి రూ. 17.70 చొప్పున రూ. 254 కోట్లకు పైగా వసూలు చేసింది. 33 నెలల వ్యవధిలో ఈ ఖాతాదారులు చేసిన డెబిట్ ట్రాన్సాక్షన్లపై విధించిన ఛార్జీల వాపసుపై ఎస్బీఐ నుంచి ఎలాంటి స్పందన లేదని నివేదిక తెలిపింది.

ఇతర బ్యాంకుల మాదిరిగా కాకుండా.. 2017 జూన్ 1 నుంచి నెలకు నాలుగు మించిన ప్రతి డెబిట్ లావాదేవీకి SBI రూ. 17.70 వసూలు చేసిందని నివేదిక పేర్కొంది. క్యాష్ విత్‌డ్రా, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), ఇమీడియెట్ పేమెంట్ సర్వీసెస్ (IMPS), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS), చెక్.. వంటి పద్ధతుల్లో చేసే విత్‌డ్రా టాన్సాక్షన్‌ను డెబిట్ ట్రాన్సాక్షన్ అంటారు.

ప్రభుత్వం, RBI పిలుపు మేరకు డిజిటల్ పేమెంట్ పద్ధతులను స్వీకరించిన SBI- BSBDA వినియోగదారులపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపింది. SBI వైఖరి కారణంగా తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించేందుకు 2020 ఆగస్టులో ఆర్థిక శాఖ కసరత్తులు ప్రారంభించింది. ఆగస్టు 2020 చివరి నాటికి డిజిటల్ పేమెంట్ మోడ్‌లను ఉపయోగించి నిర్వహించే లావాదేవీలపై వసూలు  చేసిన ఛార్జీలను (SBI fees) తిరిగి చెల్లించాలని SBIకి CBDT సూచించింది.

UPI, రూపే డెబిట్ కార్డ్‌తో సహా ఇతర డిజిటల్ పేమెంట్ మోడ్‌లను ఉపయోగించి నిర్వహించే లావాదేవీలపై జనవరి 1, 2020 నుంచి వసూలు చేసిన ఛార్జీలను తిరిగి చెల్లించాలని బ్యాంకులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సూచించింది. 2020 ఆగస్టు 30న ఈ ప్రకటన జారీ చేసింది. ఇలాంటి మోడ్‌ల ద్వారా భవిష్యత్తులో నిర్వహించే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కూడా పేర్కొంది. CBDT ఆదేశం ప్రకారం.. 2021 ఫిబ్రవరి 17 నాటికి, BSBDA కస్టమర్లకు UPI, రూపే డెబిట్ కార్డ్ డిజిటల్ ట్రాన్సాక్షన్లపై వసూలు చేసిన రూ. 17.70 నిధులను SBI రీఫండ్‌ను ప్రారంభించిందని, కానీ ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతూనే ఉందని ఈ నివేదిక తెలిపింది. IIT-ముంబై స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ ఆశిష్ దాస్ ఈ రిపోర్టును తయారు చేశారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Pmjdy, Sbi, State bank of india

తదుపరి వార్తలు