Loan Offers | లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. వివిధ రకాల రుణాలపై (Loan) ఆఫర్లు అందుబాటులో ఉంచింది. తక్కువ ఈఎంఐ, వడ్డీ రేటు తగ్గింపు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు వంటి బెనిఫిట్స్ కల్పిస్తోంది.
స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలు వెల్లడించింది. దీపావళి ఆఫర్లు తీసుకువచ్చింది. కారు రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కల్పిస్తోంది. అంతేకాకుండా కార్ లోన్ ఈఎంఐ కూడా తక్కువగానే ప్రారంభం అవుతోంది. రూ.లక్ష మొత్తానికి ఈఎంఐ రూ. 1564 నుంచి స్టార్ట్ అవుతోంది.
వావ్.. కేవలం రూ.3 లక్షలకే మహీంద్రా స్మాల్ ఎలక్ట్రిక్ కారు? ఫీచర్లు ఇవే!
అలాగే పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. ఈ తరహా రుణాలపై కూడా కస్టమర్లు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన పని లేదు. జీరో ప్రాసెసింగ్ చార్జీల బెనిఫిట్ ఉంది. పర్సనల్ లోన్‌పై ఈఎంఐ రూ.లక్షకు రూ. 1880 నుంచి ప్రారంభం అవుతోంది. ఇక గోల్డ్ లోన్ విషయానికి వస్తే.. ఈ రుణాలపై రూ.లక్ష మొత్తానికి ఈఎంఐ రూ. 3145గా ఉంది.
బంపరాఫర్.. మీ డబ్బుకు ఈ బ్యాంక్‌లో అదిరే లాభం, ఉచితంగా రూ.5 లక్షల బెనిఫిట్!
Make the festival of lights become more beautiful for you and family. Get exclusive offers on #GoldLoans, #PersonalLoans & #CarLoans with Zero Processing Fees and more. Apply now on YONO app or visit https://t.co/GEQf43EoZC to know more.#SBI #AmritMahotsav #UtsavKeRangSBIKeSang pic.twitter.com/eWxzo1Gvvs
— State Bank of India (@TheOfficialSBI) October 24, 2022
బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా రుణం కోసం అప్లై చేయొచ్చు. దీని కోసం యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ హోమ్ లోన్ తీసుకునే వారికి కూడా ఆఫర్లు అందిస్తోంది. జీరో ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కల్పిస్తోంది. నో హిడెన్ చార్జీలు ప్రయోజనం ఉంది. వడ్డీ రేటు కూడా 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.
పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 10.55 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.15 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ అయితే తక్కువ వడ్డీ పడుతుంది. వెహికల్ లోన్ అయితే వడ్డీ రేటు 8.1 శాతం నుంచి ఆరంభం అవుతోంది. ఎడ్యుకేషన్ లోన్స్ అయితే వడ్డీ రేటు 8 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. లోన్ పొందాలని భావించే వారు ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Car loans, Home loan, Personal Finance, Personal Loan, Sbi, State bank of india