SBI Good News: గుడ్ న్యూస్... వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

SBI cuts interest rates | హోమ్‌లోన్‌పై వడ్డీ రేటును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 బేసిస్ పాయింట్లు తగ్గించడం విశేషం. రూ.30 లక్షల లోన్ వరకు ఇది వర్తిస్తుంది.

news18-telugu
Updated: April 10, 2019, 12:15 PM IST
SBI Good News: గుడ్ న్యూస్... వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ
దసరా పండుగకు ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన శుభవార్త చెప్పింది.
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు శుభవార్త. రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది ఎస్‌బీఐ. ఇప్పటి వరకు 8.55 శాతం ఉన్న ఎంసీఎల్ఆర్ రేటుపై 5 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ప్రస్తుతం ఎంసీఎల్ఆర్ రేటు 8.50 శాతంగా ఉంది. ఏప్రిల్ 10 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చేశాయి. మిగతా బ్యాంకులతో పోలిస్తే వడ్డీ రేట్లు ఎస్‌బీఐలోనే తక్కువగా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 8.70 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేటు 8.75 శాతం. మరోవైపు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతంగా ఉంది.

Read this: Election 2019: మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి 3 మార్గాలు

హోమ్‌లోన్‌పై వడ్డీ రేటును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 బేసిస్ పాయింట్లు తగ్గించడం విశేషం. రూ.30 లక్షల లోన్ వరకు ఇది వర్తిస్తుంది. దీంతో గతంలో 8.70-9.00 శాతం మధ్య ఉన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.60-8.90 శాతానికి తగ్గాయి. ఐసీఐసీఐ హోమ్‌ లోన్ రేట్లు 9.05 నుంచి 10.25 శాతం మధ్య ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించింది.

Yamaha MT-15: యమహా కొత్త బైక్ ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

Election 2019: నిజాయితీ గల నేతలు కనిపించడం లేదు... ఓ జంట వినూత్న ప్రచారంElection 2019: ఓటు వేసే ముందు మీ అభ్యర్థి కేసుల గురించి ఇలా తెలుసుకోండి

Election 2019: ఎన్నికల్లో ఓటు వేస్తే పెట్రోల్‌పై డిస్కౌంట్
Published by: Santhosh Kumar S
First published: April 10, 2019, 12:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading