• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • STATE BANK OF INDIA CHHOTA ATM OR MINI ATM SERVICE PROVIDES CASH WITHDRAWALS AT POINT OF SALE TERMINALS KNOW HOW IT WORKS SS

SBI: ఏటీఎం పనిచేయట్లేదా? కిరాణా షాప్‌లో డబ్బులు తీసుకోవచ్చు ఇలా

SBI: ఏటీఎం పనిచేయట్లేదా? కిరాణా షాప్‌లో డబ్బులు తీసుకోవచ్చు ఇలా

SBI: ఏటీఎం పనిచేయట్లేదా? కిరాణా షాప్‌లో డబ్బులు తీసుకోవచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

State Bank Cash Point: Chhota ATM | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లతో పాటు ఇతర బ్యాంకుల డెబిట్ కార్డు ఉన్నవారు ఎస్‌బీఐ పీఓఎస్ వాడుతున్న కిరాణా షాపులు, ఇతర దుకాణాల్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

  • Share this:
    డబ్బులు డ్రా చేద్దామని వెళ్తే ఏటీఎం పనిచేయకపోవడం, పనిచేస్తున్నా అందులో డబ్బులు లేకపోవడం లాంటి అనుభవాలు అందరికీ ఎదురయ్యేవే. అత్యవసర సమయాల్లో ఏటీఎంలో డబ్బులు డ్రా చేయలేకపోతే సామాన్యులు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కస్టమర్లు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Cash@pos సేవల్ని చాలాకాలం క్రితమే ప్రారంభించింది. షాపుల్లో కస్టమర్లు కార్డు స్వైప్ చేసే మెషీన్‌ను పీఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్ అని అంటారు. సాధారణంగా బిల్లులు చెల్లించడానికి కార్డుల్ని స్వైప్ చేస్తుంటారు. కస్టమర్లకు డబ్బులు అందించేందుకు పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్లను వాడుకుంటోంది ఎస్‌బీఐ. అత్యవసరంగా డబ్బులు అవసరమైనవారికి Cash@pos సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లతో పాటు ఇతర బ్యాంకుల డెబిట్ కార్డు ఉన్నవారు ఎస్‌బీఐ పీఓఎస్ వాడుతున్న కిరాణా షాపులు, ఇతర దుకాణాల్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఈ సేవల్నే ఛోటా ఏటీఎం, మినీ ఏటీఎం అని పిలుస్తుంటారు. ఈ సేవల్ని అందించే కిరాణా షాపులు, దుకాణాల దగ్గర మీకు 'State Bank Cash Point: Chhota ATM' పోస్టర్ కనిపిస్తుంది.

    sbi mini atm, sbi mini atm withdrawal limit, sbi mini atm service, sbi mini atm service chota atm, sbi mini atm franchise, sbi pos cash withdrawal limit, sbi pos machine charges 2019, sbi pos machine cash withdrawal, state bank of India, ఎస్‌బీఐ మినీ ఏటీఎం, ఎస్‌బీఐ పీఓఎస్ ఏటీఎం, ఎస్‌బీఐ ఏటీఎం సేవలు, ఎస్‌బీఐ కిరాణా షాప్ ఏటీఎం, ఎస్‌బీఐ పీఓఎస్ క్యాష్ విత్‌డ్రాయల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    image: SBI


    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం ఒక కార్డుపై రోజుకు రూ.1,000 వరకు దుకాణాల్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం కస్టమర్లు ఆ షాపులో ఏమీ కొనాల్సిన అవసరం లేదు. ఈ ట్రాన్సాక్షన్స్ చేసినందుకు సదరు వ్యాపారులకు ఒక ట్రాన్సాక్షన్‌పై రూ.5 ఇన్సెంటీవ్ లభిస్తుంది. అంతేకాదు... షాప్ యజమాని డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో వేయాల్సిన అవసరం ఉండదు. సమయం ఆదా అవుతుంది. డబ్బులు డ్రా చేసుకునే సేవల్ని అందిస్తున్నందుకు కస్టమర్లు వ్యాపారులకు, వ్యాపారులు బ్యాంకులకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే కేవలం క్యాష్ విత్‌డ్రాయల్స్ కోసమే టెర్మినల్ ఉపయోగిస్తే సాధారణ ఛార్జీలు వర్తిస్తాయి. మీరు వ్యాపారం చేస్తున్నట్టైతే, మీరు కూడా Cash@pos సేవల్ని అందించాలనుకుంటే మీ హోమ్ బ్రాంచ్‌లో కాంటాక్ట్ కావచ్చు.

    Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Business Idea: రూ.50,000 పెట్టుబడితో ఫాస్ట్‌ట్యాగ్ బిజినెస్ స్టార్ట్ చేయండి ఇలా

    LIC Revival Campaign: గుడ్ న్యూస్... పాలసీ రివైవల్ క్యాంపైన్‌ గడువు పొడిగించిన ఎల్ఐసీ

    Indian Railways Tatkal Rules: రైలు టికెట్ తత్కాల్‌లో బుక్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసా?
    First published: