Home /News /business /

STATE BANK OF INDIA CHARGES KNOW SBI DD MAB ATM CHEQUE BOOK CHARGES SS

SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...

SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...

SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...

SBI Charges | అకౌంట్‌లో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.25,000 లోపు మెయింటైన్ చేసినవాళ్లు 5 సార్లు ఉచితంగా ఏటీఎం లావాదేవీలు జరపొచ్చు. రూ.25,000 కన్నా ఎక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినవాళ్లకు ఎలాంటి ఛార్జీలు వర్తించవు.

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. దేశంలో 24,000 బ్రాంచులు 59,000 ఏటీఎంలు ఉన్నాయి. అంతేకాదు 36 దేశాల్లో 195 ఆఫీసులు ఉన్నాయి. అతిపెద్ద బ్యాంకింగ్ నెట్‌వర్క్‌తో కోట్లాదిమంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. మరి మీకూ ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు విధించే ఛార్జీల గురించి మీకు తెలుసా? అందులో ప్రధానమైన 5 ఛార్జీలు ఇవే.

  1. SBI-మినిమమ్ అకౌంట్ బ్యాలెన్స్(MAB) ఛార్జీలు


  మీ ఎస్‌బీఐ అకౌంట్‌లో బ్యాలెన్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా? మినిమమ్ అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. మెట్రో బ్రాంచ్‌లల్లోని అకౌంట్లలో రూ.5,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. 50 శాతం కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉంటే రూ.50+జీఎస్టీ వసూలు చేస్తుంది ఎస్‌బీఐ. బ్యాలెన్స్ 50 శాతం నుంచి 75 శాతం మధ్య తక్కువగా ఉంటే రూ.75+జీఎస్టీ, 75 శాతం కన్నా ఎక్కువ బ్యాలెన్స్ తగ్గితే రూ.100+జీఎస్టీ జరిమానా విధిస్తుంది ఎస్‌బీఐ. అర్బన్ బ్రాంచుల్లో రూ.3,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. 50 శాతం కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉంటే రూ.40+జీఎస్టీ వసూలు చేస్తుంది ఎస్‌బీఐ. బ్యాలెన్స్ 50 శాతం నుంచి 75 శాతం మధ్య తక్కువగా ఉంటే రూ.60+జీఎస్టీ, 75 శాతం కన్నా ఎక్కువ బ్యాలెన్స్ తగ్గితే రూ.80+జీఎస్టీ జరిమానా విధిస్తుంది ఎస్‌బీఐ. సెమీ-అర్బన్ బ్రాంచుల్లో రూ.2,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. 50 శాతం కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉంటే రూ.25+జీఎస్టీ వసూలు చేస్తుంది ఎస్‌బీఐ. బ్యాలెన్స్ 50 శాతం నుంచి 75 శాతం మధ్య తక్కువగా ఉంటే రూ.50+జీఎస్టీ, 75 శాతం కన్నా ఎక్కువ బ్యాలెన్స్ తగ్గితే రూ.75+జీఎస్టీ జరిమానా విధిస్తుంది ఎస్‌బీఐ. గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచుల్లో రూ.1,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. 50 శాతం కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉంటే రూ.20+జీఎస్టీ వసూలు చేస్తుంది ఎస్‌బీఐ. బ్యాలెన్స్ 50 శాతం నుంచి 75 శాతం మధ్య తక్కువగా ఉంటే రూ.30+జీఎస్టీ, 75 శాతం కన్నా ఎక్కువ బ్యాలెన్స్ తగ్గితే రూ.50+జీఎస్టీ జరిమానా విధిస్తుంది ఎస్‌బీఐ.

  Read this: SBI Good News: గుడ్ న్యూస్... వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

  State Bank of India, sbi charges, sbi charges 2019, SBI DD charges, sbi new charges, sbi charges for minimum balance, sbi minimum balance penalty charges, SBI MAB charges, sbi service charges, sbi service charges and fees, SBI ATM usage charges, sbi dd charges 2019, sbi atm charges 2019, SBI Cheque book charges, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ ఛార్జీలు, ఎస్‌బీఐ డీడీ ఛార్జీలు, ఎస్‌బీఐ మినిమమ్ బ్యాలెన్స్, ఎస్‌బీఐ సర్వీస్ ఛార్జీలు, ఎస్‌బీఐ ఏటీఎం ఛార్జీలు, ఎస్‌బీఐ చెక్ బుక్ ఛార్జీలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


  2. SBI-ఏటీఎం ఛార్జీలు


  గత నెలలో అకౌంట్‌లో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.25,000 లోపు మెయింటైన్ చేసినవాళ్లు 5 సార్లు ఉచితంగా ఏటీఎం లావాదేవీలు జరపొచ్చు. రూ.25,000 కన్నా ఎక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినవాళ్లకు ఎలాంటి ఛార్జీలు వర్తించవు. 5 ఉచిత లావాదేవీల తర్వాత ఎస్‌బీఐ ఏటీఎంలో ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.5 నుంచి రూ.10 మధ్య ఛార్జీలు వసూలు చేస్తుంది ఎస్‌బీఐ. ఇతర బ్యాంక్ ఏటీఎం అయితే రూ.8 నుంచి రూ.20 మధ్య ఛార్జీలు ఉంటాయి. గత నెలలో అకౌంట్‌లో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.1 లక్షకన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తే ఇతర బ్యాంక్ ఏటీఎంలో లావాదేవీలు జరిపినా ఎలాంటి ఛార్జీలు ఉండవు.

  3. SBI-చెక్ బుక్ ఛార్జీలు


  క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.1 లక్ష లోపు ఉంటే 25 చెక్కులు ఉచితంగా ఇస్తుంది ఎస్‌బీఐ. ఆ తర్వాత 10, 25, 50 చెక్కులకు రూ.30, రూ.75, రూ.150 చొప్పున వసూలు చేస్తుంది. క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.1 లక్షకన్నా ఎక్కువగా ఉన్నా చెక్ బుక్కులకు ఛార్జీలు ఉండవు. వృద్ధులకు కూడా ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50 ఛార్జ్ చేస్తుంది.

  Read this: SBI clerk Jobs: ఎస్‌బీఐలో 8,653 క్లర్క్ పోస్టులు... హైదరాబాద్‌లో 425 ఖాళీలు...

  State Bank of India, sbi charges, sbi charges 2019, SBI DD charges, sbi new charges, sbi charges for minimum balance, sbi minimum balance penalty charges, SBI MAB charges, sbi service charges, sbi service charges and fees, SBI ATM usage charges, sbi dd charges 2019, sbi atm charges 2019, SBI Cheque book charges, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ ఛార్జీలు, ఎస్‌బీఐ డీడీ ఛార్జీలు, ఎస్‌బీఐ మినిమమ్ బ్యాలెన్స్, ఎస్‌బీఐ సర్వీస్ ఛార్జీలు, ఎస్‌బీఐ ఏటీఎం ఛార్జీలు, ఎస్‌బీఐ చెక్ బుక్ ఛార్జీలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


  4. SBI-చెక్ రిటర్న్ ఛార్జీలు


  అకౌంట్‌లో డబ్బులు లేకుండా బౌన్స్ అయితే చెక్ రిటర్న్డ్ ఛార్జీల కింద రూ.500 వసూలు చేస్తోంది ఎస్‌బీఐ. సాంకేతిక కారణాల వల్ల చెక్ రిటర్న్ అయితే రూ.150 ఛార్జీలు ఉంటాయి.

  5. SBI-డీడీ ఛార్జీలు


  రూ.5,000 వరకు డీడీ ఛార్జీలు రూ.25, రూ.5,000 నుంచి రూ.10,000 వరకు డీడీ ఛార్జీలు రూ.50, రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు డీడీ ఛార్జీలు ప్రతీ వెయ్యికి రూ.5, ఒకవేళ డీడీ రూ.1,00,000 కన్నా ఎక్కువ ఉంటే ప్రతీ వెయ్యికి రూ.4 చొప్పున వసూలు చేస్తుంది ఎస్‌బీఐ.

  Yamaha MT-15: యమహా కొత్త బైక్ ఎలా ఉందో చూశారా?


  ఇవి కూడా చదవండి:

  FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు

  After Inter Career: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...

  Xiaomi Record: రెడ్‌మీ నోట్ 7 సిరీస్... ఒక్క నెలలో 10 లక్షల ఫోన్ల సేల్

  PAN Card: మీ పాన్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోవచ్చు
  First published:

  Tags: Personal Finance, Sbi

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు