Car Loan | మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కారు కొనుగోలుదారులకు తీపికబురు అందించింది. పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తోంది. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. కారు లోన్ (Loan) తీసుకునే వారికి ఏ ఏ బెనిఫిట్స్ అందిస్తున్నది వెల్లడించింది.
ఎస్‌బీఐ కారు లోన్ తీసుకునే వారికి కారు ఆన్ రోడ్ ధరలో 90 శాతం మొత్తాన్ని రుణం రూపంలో అందిస్తోంది. అంతేకాకుండా ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎస్‌బీఐ నుంచి కారు లోన్ తీసుకుంటే ఎలాంటి ప్రిపేమెంట్ చార్జీలు ఉండవు. అంతేకాకుండా ఫోర్ క్లోజింగ్ చార్జీలు కూడా చెల్లించాల్సిన పని లేదు. అంటే లోన్ ముందే చెల్లించాలని భావిస్తే.. వారికి ఎలాంటి చార్జీలు లేకుండా లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే మరో బెనిఫిట్ కూడా ఆఫర్ చేస్తోంది. ఎస్‌బీఐ కారు రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయడం లేదు.
కస్టమర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ అదిరిపోయే శుభవార్త!
అంటే ఎస్‌బీఐ ఒకేసారి మూడు శుభవార్తలు అందించిందని చెప్పుకోవచ్చు. అయితే ఏడాది తర్వాతనే ఫ్లోర్ క్లోజింగ్ చార్జీలు మినహాయింపు బెనిఫిట్ లభిస్తుంది. కొత్తగా కారు కొనుగోలు చేయానలి భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. లోన్ పొందాలని భావించే వారు దగ్గరిలోని ఎస్‌బీఐ బ్యాంక్‌కు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు ఇప్పటికే ఎస్‌బీఐ కస్టమర్లు అయితే ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా కూడా కార్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు భారీ షాక్.. బ్యాంక్ కీలక నిర్ణయం!
Go on your next road trip in your new car. Make it happen with SBI Car Loan. Apply on YONO app or visit https://t.co/vYq2VxTXuC to know more. #SBI #KhushiyonKiTaiyaari #CarLoan pic.twitter.com/mlAXxoAfyK
— State Bank of India (@TheOfficialSBI) February 6, 2023
బ్యాంక్ నుంచి కారు లోన్ తీసుకున్న వారు 7 ఏళ్ల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు పైన ఉన్న వారు బ్యాంక్ నుంచి కారు లోన్ పొందొచ్చు. 21 నుంచి 70 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు కారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎస్‌బీఐలో ఆటో లోన్స్‌పై వడ్డీ రేటు 8.55 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. లోన్ పొందాలని భావించే వారు రెండు ఫోటోలు, ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, అడ్రస్ ప్రూఫ్, ఇన్‌కమ్ ప్రూఫ్, ఆధార్ కార్డు , పాన్ కార్డ్ వంటి డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank news, Car loans, Sbi, State bank of india