హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకు కొత్త రూల్స్ ఇవే..

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకు కొత్త రూల్స్ ఇవే..

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకు కొత్త రూల్స్ ఇవే..

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకు కొత్త రూల్స్ ఇవే..

SBI Alert: కస్టమర్ల అకౌంట్ బ్యాలెన్స్, ఖాతాకు సంబంధించిన సమాచారంతో పాటు ఇతర మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు జరపడానికి USSD టెక్నాలజీ ఉపయోగపడుతుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

బ్యాంకులు (Banks) అందించే వివిధ రకాల సేవలకు వేర్వేరు ఛార్జీలు (Service Cahrges) వర్తిస్తాయి. సర్వీస్‌ను బట్టి ఈ మొత్తం మారుతుంది. అయితే పరిస్థితులను బట్టి ఈ సర్వీస్ ఛార్జీలను బ్యాంకులు సవరిస్తుంటాయి. ఇలాంటి సేవా రుసుములకు సంబంధించి తమ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది ఎస్‌బీఐ (SBI). మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన SMSలకు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయట్లేదని చెప్పింది. దీంతో స్టేట్ బ్యాంక్ కస్టమర్లు ఇప్పుడు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా సౌకర్యవంతంగా లావాదేవీలు జరపవచ్చు.

ఈ విషయాన్ని పేర్కొంటూ ఎస్‌బీఐ ఓ ట్వీట్ చేసింది. ‘మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్స్‌పై ఇప్పుడు SMS ఛార్జీలు మాఫీ చేశాం. USSD సేవలను ఉపయోగించి కస్టమర్లు ఇప్పుడు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా సౌకర్యవంతంగా లావాదేవీలు చేయవచ్చు’ అని ట్వీట్‌లో పేర్కొంది.

* మెసేజ్ ద్వారా సేవలు

కస్టమర్ల అకౌంట్ బ్యాలెన్స్, ఖాతాకు సంబంధించిన సమాచారంతో పాటు ఇతర మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు జరపడానికి USSD టెక్నాలజీ ఉపయోగపడుతుంది. దీని పూర్తి పేరు అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. ఇది SMS సౌకర్యంతో అన్ని మొబైల్ ఫోన్‌లలో అందుబాటులో ఉండే టెక్నాలజీ. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దేశ జనాభాలోని దాదాపు 65% మంది మొబైల్ యూజర్లు ఈ యూఎస్‌ఎస్‌డీ‌ ఫీచర్‌ను వినియోగిస్తున్నారు.

* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

-ముందుగా ఎస్‌బీఐ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

- మీ అకౌంట్‌లోకి లాగిన్ కావాలి.

- ఇసర్వీసెస్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

-లెఫ్ట్ సైడ్‌లో ఉన్న స్టేట్ బ్యాంకు ఫ్రీడమ్‌ను సెలక్ట్ చేయాలి

- ఆ తరువాత రిజిస్ట్రేషన్ ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

-తరువాత అకౌంట్ సెలక్ట్ చేసుకోవాలి(ఎస్‌బీ/సీఏ మాత్రమే).

-చివరగా సబ్‌మిట్ చేయండి.

ఇది కూడా చదవండి : పాన్‌ కార్డ్‌ పోగొట్టుకున్నారా? అయితే, టెన్షన్ పడకుండా ఇలా చేయండి..

* ఏటీఎం సెంటర్ల వద్ద..

ఏటీఎం సెంటర్ల వద్ద కూడా ఈ ఫీచర్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.

- ముందుగా ఎంటీఎం సెంటర్‌కు వెళ్లి డెబిట్ కార్డును స్వైప్ చేయాలి.

- ఆ తరువాత మొబైల్ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

- మొబైల్ బ్యాంకింగ్ పై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఆప్షన్ వస్తుంది.

-దానిపై క్లిక్ చేసి మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి.

* ఫోన్ ద్వారా..

USSD సేవలను పొందాలనుకునే ఎస్‌బీఐ కస్టమర్లు *99#కు డయల్ చేయాలి. ఈ సర్వీస్‌ను బ్యాంక్ పూర్తి ఉచితంగా అందిస్తోంది. ఎస్‌బీఐ కస్టమర్లు *99# సర్వీస్ ద్వారా నగదును ఇతరులకు పంపవచ్చు. ఇతరుల నుంచి నగదు స్వీకరించవచ్చు. అలాగే అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్ పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా యూపీఐ పిన్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ పొందాలంటే కస్టమర్ల మొబైల్ నంబర్ వారి బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి. అలాగే వారి దగ్గర తప్పనిసరిగా ATM/డెబిట్ కార్డ్ ఉండాలి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు