స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వృద్ధులకు ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను 'ఎస్బీఐ వీకేర్ డిపాజిట్' పేరుతో ప్రకటించింది. బ్యాంకులో సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ రేట్ల కన్నా ఈ స్కీమ్‌లో వడ్డీ రేట్లు ఎక్కువ. అంటే వృద్ధులు ఈ స్కీమ్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ పొందొచ్చు. అయితే ఎక్కువ వడ్డీ ఇచ్చే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్-SCSS ఇప్పటికే ఎస్బీఐలో ఉంది. ఈ స్కీమ్ గురించి తెలుసుకునేందుకు
ఇక్కడ క్లిక్ చేయండి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌తో పాటు 'ఎస్బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్‌ను కూడా ఆపరేట్ చేయనుంది బ్యాంకు.
'ఎస్బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్‌లో ఐదేళ్ల కన్నా ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి 80 బేసిస్ పాయింట్స్ అదనంగా వడ్డీ లభిస్తుంది. వార్షికంగా 6.5 శాతం చొప్పున వడ్డీ పొందొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో గరిష్టంగా 6.2 శాతం, ఐడీబీఐ బ్యాంకులో గరిష్టంగా 6.3 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ కొత్తగా ప్రకటించిన స్కీమ్‌లోనే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం దాదాపు ఇదే వడ్డీ లభిస్తుంది. కానీ ఎస్బీఐ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్-SCSS ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 7.4 శాతం. 'ఎస్బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్‌లో కనీసం 5 ఏళ్లు డిపాజిట్ చేయాలి. ముందే విత్‌డ్రా చేస్తే 30 బేసిస్ పాయింట్స్ వడ్డీని కోల్పోవాల్సి వస్తుంది. ఎస్బీఐ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ముందే విత్‌డ్రా చేస్తే పెనాల్టీ చెల్లించాలి.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో గరిష్టంగా రూ.15 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద కేవలం రూ.1.5 లక్షలకు మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ 'ఎస్బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. కానీ ఆదాయపు పన్ను మినహాయింపులు లభించవు. ఎక్కువ మొత్తంలో ఎక్కువకాలం డిపాజిట్ చేయాలనుకునేవారికి 'ఎస్బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్ ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చదవండి:
Cash Withdrawal: మీ ఏటీఎం కార్డుతో కిరాణా షాపులో డబ్బులు డ్రా చేయొచ్చు
SBI Home Loan: హోమ్ లోన్ కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎస్బీఐ
Lockdown: క్రెడిట్ కార్డ్ విషయంలో ఈ తప్పులు చేయొద్దుPublished by:Santhosh Kumar S
First published:May 08, 2020, 15:09 IST